Don't Miss!
- Sports
Big Bash League : క్రీజులో భారీ హిట్టర్లున్నా.. ఓటమి మాత్రం తప్పలేదు..!
- News
లాస్ ఏంజెల్స్ మాంటేరీ పార్క్‌లో కాల్పులు: 10 మంది మృతి, పలువురికి గాయాలు
- Finance
Adani Group: శుభవార్త చెప్పిన గౌతమ్ అదానీ..! త్వరలోనే ప్రారంభం కానున్న 5 IPOలు..
- Automobiles
రేపటి నుంచి ప్రారంభం కానున్న 'మిహోస్' బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?
- Lifestyle
Weekly Horoscope22.01.2023-28.01.2023 - ఈ వారం ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి...
- Technology
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
Chandramukhi 2లో జ్యోతికకు గుడ్‌బై.. చంద్రముఖిగా బాలీవుడ్ టాప్ హీరోయిన్!
దక్ష్హిణాది సినీ పరిశ్రమను రికార్డులతో ఉర్రూతలూగించిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా రంగం సిద్ధమైంది. కొరియోగ్రాఫర్, డైరెక్టర్ లారెన్స్ మాస్టర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా చంద్రముఖి2 సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతున్నది. 2005లో రిలీజైన చంద్రముఖి సినిమాలో రజనీకాంత్, నయనతార, జ్యోతిక తదితరులు నటించగా.. పీ వాసు దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ చేయగా.. హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా భూల్ భులయ్యాగా రిలీజ్ చేస్తే.. బ్లాక్ బస్టర్ విజయం అందుకొన్నది. అయితే దాదాపు 23 సంవత్సరాల తర్వాత రజనీకాంత్‌తోనే చంద్రముఖి 2 మూవీ రాబోతున్నది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
చంద్రముఖి పాత్రలో జ్యోతిక అభినయం ఇప్పటికీ ప్రేక్షకుల కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అయితే చంద్రముఖి 2 చిత్రంలో జ్యోతిక స్థానంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, టాప్ హీరోయిన్ కంగన రనౌత్‌ను దర్శకుడు లారెన్స్ రాఘవన్ తీసుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రంలో లారెన్స్ దర్శకత్వంతోపాటు హీరో పాత్రలో కనిపించనున్నారు. లారెన్స్ సరసన కంగన రనౌత్ నటించనున్నారు.

పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చంద్రముఖి 2 సినిమాను నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ నీతా లుల్లా పనిచేస్తున్నారు. ఈ సినిమా గురించి నీతా లుల్లా మాట్లాడుతూ.. చంద్రముఖి గెటప్, క్యాస్టూమ్, హెయిర్ డిజైన్, ఇతర పనుల్లో బిజీగా ఉన్నాం. ఈ సినిమాకు పనిచేయడం గొప్ప అనుభూతి. కంగన రనౌత్‌తో కలిసి పనిచేయడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. డిసెంబర్ తొలివారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది అని చెప్పారు.