Kanguva: కంగువా రిలీజ్‌పై హైకోర్టు స్టే.. సూర్య మూవీకి షాకిచ్చిన రిలయన్స్!
తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన మూవీ కంగువ. దర్శకుడు శివ డైరెక్షన్‌లో రూపొందుతున్న పిరియాడిక్ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో చెన్నై కోర్టు ఈ సినిమా రిలీజ్‌పై స్టే విధించింది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రిలయన్స్‌తో కేఈ జ్ఞానవేల్ రాజా ఉన్న ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం తలెత్తడంతో కోర్టు జోక్యం చేసకోవాల్సి వచ్చింది. గతంలో తమ నుంచి తీసుకొన్న రుణం సకాలంలో చెల్లించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. రిలయన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించడంతో విచారించిన తమిళనాడు హైకోర్టు ఈ సినిమా రిలీజ్‌కు బ్రేక్ వేసింది.

మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం.. విక్రమ్ నటించిన తంగలాన్, అల్లు శిరీష్ నటించిన టెడ్డీ సినిమా కోసం గతంలో 100 కోట్లు ఫైనాన్స్ తీసుకొన్నారు. అయితే వాటి విషయంలో నిర్మాత బకాయి పడ్డారు. అయితే వారి మధ్య చర్చలు విఫలం కావడంతో రిలయన్స్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.
అయితే తమకు చెల్లించాల్సిన 55 కోట్ల రూపాయలు చెల్లించే వరకు కంగువ సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలని కోర్టును తమ పిటిషన్‌లో కోరినట్టు తెలిసింది. అయితే కోర్టు స్టే నేపథ్యంలో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే రిలీజ్‌కు సానుకూలమైన పరిష్కారం లభిస్తుందనే యూనిట్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











