పవర్ స్టార్‌ను అందరూ ఎగతాళి చేశారు
తాను లేకుండా పెద్ద తమిళ సినిమా లేదనే అత్యున్నత హోదాను సంపాదించుకున్నాడు ప్రముఖ హాస్యనటుడు సంతానం. ఆయన నిర్మాతగా మారిన తొలి చిత్రం 'కన్నా లడ్డుతిన్న ఆశయా'. సేతు, సంతానం, 'పవర్ స్టార్' శ్రీనివాసన్ తదితరులు ఇందులో నటిస్తున్నారు. విశాఖసింగ్ హీరోయిన్. యంగ్‌సూపర్‌స్టార్ శింబు అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక చెన్నైలో జరిగింది. దర్శకుడు శంకర్ ఆడియోను ఆవిష్కరించగా, శింబు అందుకున్నాడు. కార్యక్రమంలో పవర్‌స్టార్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
అనంతరం శంకర్ మాట్లాడుతూ.. '' 'ఐ' చిత్రం తెరకెక్కించడంలో బిజీగా ఉన్నా. రెండింతల ఒత్తిడిని ఎదుర్కొంటున్నా. ఇలాంటప్పుడు నేను హాస్య సినిమాలకే ప్రాధాన్యత ఇస్తా. ఆ మధ్య 'ఓకే ఓకే' చూసి కడుపుబ్బా నవ్వుకున్నా. అద్భుతంగా తెరకెక్కించారు. తాజాగా 'నడువుల కొంజం పక్కత్త కానుం' చూసి ఆశ్చర్యపోయా. ఇలా కూడా విజయవంతమైన సినిమా చేయవచ్చా.. అనిపించింది. సంతానం నటుడిగా ఉన్నతస్థితికి చేరుకున్నా, ఆయన ఒదిగేగుణమే మరింత కీర్తి తెచ్చిపెడుతోంది. ఇలాంటి పీక్ పిరీయడ్‌లోనూ ఆయన నిర్మాతగా మారారంటే నిజంగానే అభినందనీయం. ఇచ్చిన కాల్షీట్‌కు కరెక్టు సమయంలో స్పాట్‌కు వెళ్లి తనను తాను నిరూపించుకుంటున్నారు. ఆయన ఎప్పటికీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను'అని చెప్పారు.


Click it and Unblock the Notifications












