అంటే యాజటీజ్ ఈ సాంగ్ ని ముమైత్ పై చిత్రీకరిస్తున్నారని కాదు. ఆ పాట రేంజిలో తాము తీస్తున్న పాట హిట్టవ్వాలని ఆ డైరక్టర్ కోరికట. ఇంతకీ ఈ సాంగ్ తీయబోయేది...విక్రమ్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న మల్లన్న(కందసామి)సినిమా కోసమట. "Pambhala Kannale" అంటూ సాగే ఈ సాంగ్ పాత హిట్ తమిళ సాంగ్ కి రీమిక్స్ ట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ పాటే సినిమాకు హైలెట్ అవ్వాలని దర్శకుడు సుశీగణేషన్ భావిస్తున్నాడుట. విక్రమ్ ఈ సాంగ్ లో ఆమె సరసన డాన్స్ చేస్తాడుట. ఓ ప్రక్క పోలీసులు ఛేజింగ్ చేస్తుంటే ఈ పాట వస్తుందిట. కిక్ కోసం దర్సకుడు అలనాటి ఖలనాయక్ లోని చోళికే ఫీచే సాంగ్ తరహాలో ఈ పాట ఎక్సపోజింగ్ ఉండి,మీనింగ్ హాట్ గా ఉండాలని దర్శకుడు లిరిక్ రైటర్స్ ని ఆదేసించాడుట. ఈ పాటలో చాలా తక్కువ బట్టలతో ముమైత్ కొత్తగా కనిపించి ఆనందపరుస్తుందిట. చూద్దాం...