అలా అతడు నగ్నంగా గదిలోకి వచ్చి..చేదు అనుభవాన్ని బయటపెట్టిన కర్ణన్, మాస్టర్ నటి

తమిళనాడులో స్కూల్ పిల్లలపై లైంగిక దాడులు, వేధింపుల వ్యవహారం సంచలనం రేపింది. చెన్నైలోని ప్రఖ్యాత పీఎస్‌బీబీ స్కూల్‌లో టీచర్ రాజగోపాలన్ కీచకపర్వం విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆ విద్యార్థుల్లో ఒకరనై యువ నటి ఉండటం గమనార్హం. పిలల్ని అసభ్యకరంగా వేధించిన ఉపాధ్యాయుడిపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ (POCSO) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో బాలనటి గౌరీ కిషన్ షాకింగ్ విషయాలను బయటపట్టింది. ఆ వివరాల్లోకి వెళితే...

PNBB స్కూల్‌లో

PNBB స్కూల్‌లో

చెన్నైలోని పీఎస్‌బీబీ స్కూల్ ఘటన బయటకు రావడంతో అలాంటి చేదు అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కీచక ఉపాధ్యాయులు శృంగార లీలలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

మాస్టర్ చిత్రంలో నటించిన గౌరీ కిషన్

మాస్టర్ చిత్రంలో నటించిన గౌరీ కిషన్


ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో విజయ్ సేతుపతి, త్రిషా జంటగా నటించిన మాస్టర్ చిత్రంలో నటించిన గౌరీ కిషన్ దిగ్బ్రాంతికరమైన విషయాలను బటపెట్టారు. గౌరీ కిషన్ ఇటీవల ధనుష్ నటించిన కర్ణన్ చిత్రంలో, విజయ్ మాస్టర్ చిత్రంలో కూడా మంచి పాత్రలను పోషించి మెప్పించారు. ఈ సందర్భంగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో తన కోపాన్ని వ్యక్తం చేస్తూ పలు పోస్టులను షేర్ చేసింది.

స్కూల్ అంటే పవిత్రమైన ప్రదేశం

స్కూల్ అంటే పవిత్రమైన ప్రదేశం

స్కూల్ అంటే ఎన్నో మెమొరీస్ ఉంటాయి. అలాంటి వాతావరణంలో ఇలాంటి భయాలు పిల్లలకు జీర్ణించుకోలేదు. జీవితకాలం వారిని వెంటాడుతుంటాయి. ఎంతో మంది పిల్లల మాదిరిగా నేను కూడా ఇలాంటి దారుణాలను చవి చూశాను. స్కూల్ అంటే ఎన్నో విషయాలను నేర్చుకొనే పవిత్రమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో ఇలాంటి సంఘటనలా అంటూ కామెంట్ చేసింది.

నా స్నేహితురాలికి చేదు అనుభవం

నా స్నేహితురాలికి చేదు అనుభవం

పీఎస్‌బీబీ స్కూల్‌లో జరిగిన సంఘటన సందర్భంగా నా స్నేహితురాలికి జరిగిన ఓ సంఘటనను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. హిందూ సీనియర్ సెకండరీ స్కూల్‌లో జరిగిన పెద్ద సమస్యను గురించి వివరిస్తాను. నా స్కూల్‌లో ఉపాధ్యాయుడు నేరుగా బాత్రూం నుంచి దాదాపు నగ్నంగా క్లాస్‌లోకి వచ్చాడు. నా స్నేహితురాలిని లైంగికంగా వేధించాడు అని గౌరీ కిషన్ పేర్కొన్నది.

Recommended Video

Sundeep Kishan Road Show | A1 Express విజయ యాత్ర
గౌరీ కిషన్ ఎడ్యుకేషన్ గురించి

గౌరీ కిషన్ ఎడ్యుకేషన్ గురించి

గౌరి కిషన్ తన విద్యార్థి దశలో జర్నలిజం, సైకాలజీ, ఇంగ్లీష్‌లో డిగ్రీ పూర్తి చేశారు. స్కూల్‌లో అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై చిన్మయి చేసిన పోరాటంపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. బాధితులకు న్యాయం జరిగేందుకు ఆమె చేసిన కృషి ఉన్నతం అంటూ గౌరీ కిషన్ కామెంట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X