వదినతో కలిసి వచ్చిన హీరో.. వైరల్‌గా మారిన పోస్టర్స్
యుగానికొక్కడు, ఆవారా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కార్తీ.. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అన్న సూర్య కంటే లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. అతని కంటే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తాజాగా ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి తిరుగులేని రికార్డును క్రియేట్ చేసుకున్నాడు. అన్న కెరీర్ డల్‌గా సాగుతూ ఉంటే.. తమ్ముడి కెరీర్ మాత్రం ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతోంది.

వందకోట్లు కొల్లగొట్టిన ఖైదీ
ఈ ఏడాది దేవ్ సినిమాతో పలకరించిన కార్తీకి నిరాశ మిగలగా.. ఖైదీతో ఆనందం రెట్టింపైంది. కొత్తగా ట్రై చేసిన కార్తీకి భారీ హిట్ వచ్చింది. కమర్షియల్ హంగులకు పోకుండా కథను నమ్ముకునే సినిమాను తీయడం ఖైదీకి కలిసివచ్చింది. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ వందకోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టి రికార్డు సృష్టించాడు.

మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న ఝాన్సీ..
ఓ వైపు తమ్ముడి కెరీర్ జోరుగా సాగుతూ ఉండగా.. మరో వైపు భార్య జ్యోతిక కెరీర్ కూడా గాడిలో పడింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నటించి మెప్పిస్తోంది. ఝాన్సీ, జాక్‌పాట్ లాంటి సినిమాలతో మంచి ఫామ్‌లోకి వచ్చింది. రీసెంట్‌గా రాక్షసితో పలకరించగా.. విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
బోల్తా కొట్టిన బందోబస్త్..
ఎన్నో అంచనాలతో తెరకెక్కించిన బందోబస్త్.. డిజాస్టర్‌గా మిగిలింది. మోహన్ లాల్, ఆర్య లాంటి స్టార్లతో అత్యంత భారీగా నిర్మించిన బందోబస్త్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో మళ్లీ డైలామాలో పడ్డాడు సూర్య. అంతకుముందు వచ్చిన ఎన్‌జీకే చిత్రం కూడా అదే ఫలితాన్ని మిగిల్చింది. తాజాగా ఆకాశమే నీ హద్దురా అంటూ తన కొత్తసినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చాడు.
Recommended Video

వదిన, మరిది కలిసి..
అయితే ఈ ఫ్యామిలీ నుంచి మరో సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేసిన ఈ పోస్టర్స్ అందర్నీఆకట్టుకుంటున్నాయి. ఖైదీగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తీ.. ఈ సారి వదినతో కలిసి ‘దొంగ'గా రాబోతోన్నాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జీతు జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందకు సిద్దమవుతోంది.


Click it and Unblock the Notifications











