అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్ ని ఆ హీరో మరిపిస్తాడా...
'యుగానికి ఒక్కడు", 'ఆవారా" వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో కార్తీ..హీరో సూర్య తమ్ముడుగా పరిచయమైనా రెండు చిత్రాలతోనే టాలీవుడ్ లో తనేంటో నిరూపించుకున్న కార్తీ ప్రస్తుతం రవితేజ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన హిట్ చిత్రం 'విక్రమార్కుడు" రీమేక్ లో నటిస్తున్నాడు...'సిరుతై"అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంని తెలుగులో గోపీచంద్ హీరోగా 'శౌర్యం", 'శంఖం" వంటి చిత్రాలని రూపొందించిన శివ రూపొందిస్తున్నాడు.
ఈ చిత్రంలో కార్తీ క్యారెక్టర్ పేరు రాకెట్ రాజా. ఈ పేరుతో కార్తీ ఉండే ఏరియాలో ఓ క్యాస్ట్ కి సంబంధించిన, పలుకుబడి కలిగిన వ్యక్తి ఉండటంతో ఆ వ్యక్తి వర్గానికి చెందిన కొంత మంది ఈ పేరుని చిత్రంలో తొలగించాలని గొడవకు దిగడంతో దర్శక నిర్మాతలు రాకెట్ రాజా అనే పేరుని తొలగించే పనిలో వున్నారట. తన అందాల ప్రియురాలు తమన్నాతో..హాట్ హాట్ రొమాన్స్ కి కరెక్ట్ గా సెట్ అయిన 'రాకెట్ రాజా" పేరుని మారుస్తున్నందుకు కార్తీకి..బాధగా ఉందట..


Click it and Unblock the Notifications











