‘ఆవారా’ కార్తి తండ్రయ్యాడోచ్!
రంజనితో కార్తి వివాహం జులై 3, 2011న జరిగింది. కార్తి సోదరుడు సూర్య-జ్యోతిక దంపతులకు కూడా ఇద్దరు ఆడ సంతానమే అయిన సంగతి తెలిసిందే. తాజాగా కార్తికి కూడా ఆడసంతానమే కలగడంతో వారి ఫ్యామిలీ మొత్తం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు.
కార్తి నటించిన అలెక్స్ పాండ్యన్ చిత్రం కూడా నిన్ననే తమిళనాడులో గ్రాండ్ గా విడుదలయింది. ఇదే సినిమా తెలుగులో కాస్త లేటుగా 'బ్యాడ్ బాయ్'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టూడియో గ్రీన్ పతాకంపై అగ్ర నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా ఈచిత్రాన్ని నిర్మించారు. కార్తీ సరసన అనుష్క కథానాయికగా నటించింది.
ఈ సినిమా గురించి కార్తి మాట్లాడుతూ...'బ్యాడ్‌బాయ్ చిత్రాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా చాలా భారీ ఎత్తున నిర్మించారు. దర్శకుడు సురాజ్ చాలా బాగా తీసారు. ఇందులో నా క్యారెక్టర్ చాలా భిన్నంగా వుంటుంది. అనుష్క క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్ వుంది. దేవిశ్రీప్రసాద్ సూపర్‌హిట్ మ్యూజిక్ ఇచ్చారు. తెలుగులో నాకు 'బ్యాడ్‌బాయ్' మరో గుడ్ హిట్ మూవీ అవుతుంది' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఎస్.శరవణన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కో-ప్రొడ్యూసర్స్: ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎన్.ఆర్.ప్రభు, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్ రాజా, దర్శకత్వం: సురాజ్.


Click it and Unblock the Notifications












