ఫైటర్స్ ఘర్షణ : కార్తి ‘బిరియాని’ ప్యాకప్
షూటింగ్ జరిగే పరిస్థితి లేక పోవడంతో హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని 'బిరియాని' యూనిట్ చెన్నై వెళ్లి పోయింది. ఇక్కడ జరుగాల్సిన షూటింగును తిరిగి చెన్నైలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.
హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రంలో తమిళ నటుడు ప్రసన్న, నీతు చంద్ర, స్నేహ, రాంకీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో కూడా ఈచిత్రాన్ని అదే పేరుతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో కార్తి, హన్సిక లుక్స్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
గత సినిమాల కంటే కార్తీని దర్శకుడు వెంకట్ ప్రభు మరింత స్టైలిష్ గా చూపిస్తాడని ఆ పోస్టర్లు చూస్తే స్పష్టం అవుతోంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రంలోకి ఒక కొత్త పాత్ర ఎంటర్ అవబోతుంది. కొత్త అంటే కొత్తవాల్లేమి కాదు, ఒకప్పుడు తమిల్ లో మంచి యాక్షన్ చిత్రాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అప్పటి హీరో "రాంకీ".
ఈ మద్య సిని పరిశ్రమ కు దూరంగా వున్న రాంకీ ఇప్పుడు బిరియానీ సినిమా తో మళ్ళి పరిశ్రమ లోకి అడుగుపెట్టబోతున్నాడు. రాంకీ నటించిన తమిళ సినిమా అప్పట్లో "సిందూరపువ్వు" పేరుతో విడుదలైంద. ఆ సినిమాను ఎవరు మర్చిపోయి వుండరు, అంతలా గుర్తుండిపోయింది ఆ సినిమా. అందులో తన సహనటి నిరోషా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాంకీ. ఇప్పుడు ఈ బిరియానీ సినిమా లో రాంకీ ఒక కీలక పాత్ర చేయబోతున్నాడు. అది ఎలాంటి పాత్ర, ఎలా వుంటుంది అనేది తెరపైన చూడవలసిందే.


Click it and Unblock the Notifications












