తెలుగు సినీపరిశ్రమపై కార్తీకి వున్న రెస్పెక్ట్ అది...!
కోలీవుడ్ నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సూర్య తర్వాత నెక్స్ ట్ ప్లేస్ లో కొనసాగుతున్న సూర్య సోదరుడు కార్తీ..వరుస హిట్లతో తమిళ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. యుగానికి ఒక్కడు, ఆవారా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ మంచి ఇమేజ్ ని సంపాదించుకున్న కార్తీ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే.
తన స్వస్థలమైన కోయంబత్తూరులో జూలై 3న రంజనీతో కార్తీ వివాహం జరగబోతోంది. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా భారీ సంఖ్యలో సినీ ప్రముఖులు కార్తీ వివాహానికి హాజరు కాబోతున్నారన్నది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఇదిలా వుంటే కార్తీ స్వయంగా హైదరాబాద్ వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖలందరినీ పర్సనల్ గా కలిసి తన వివాహానికి ఆహ్వానించడం విశేషం. జూలై 7న చెన్నైలో కార్తీ మ్యారేజ్ రిసెప్షన్ ని ఎంతో భారీగా ఏర్పాటు చేస్తున్నారు..


Click it and Unblock the Notifications











