విజయానందంలో కార్తీ.. ఫ్యాన్స్ ముందుకు రానున్న హీరో

డిఫరెంట్ కథలను ఎందచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో కార్తీ. తమిళ ప్రేక్షకులను మెప్పిస్తూనే.. తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరవ్వడం కార్తీకే దక్కింది. అయితే చివరగా వచ్చిన దేవ్ చిత్రం నిరాశపరిచినా.. ఖైదీ మాత్రం ఆ లోటును పూడ్చింది.

నిన్న (అక్టోబర్ 25) విడుదలైన ఖైదీ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి ఆట తరువాత అన్ని థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరిగిందని రిపోర్ట్ వచ్చింది. మౌత్ టాక్‌తో జనాల్లోకి వెళ్తోన్న ఈ చిత్రం కార్తీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవనుంది.

 Karthi Comes Live On facebook At 6pm At 26th October

తమిళనాటే కాకుండా తెలుగులోనూ ఫస్ట్ డే కలెక్షన్లలో దుమ్ములేపిన ఖైదీ.. సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులు, అభిమానులతో ముచ్చటించేందుకు వారి ముందుకు రానున్నాడు. నేటి సాయంత్రం ఆరు గంటలు ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి రానున్నట్లు తెలిపాడు.

లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్యామ్ సీకే సంగీతాన్ని అందించాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్నీ ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఈ చిత్రంలో నరైన్, జార్జ్ మరియన్ ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X