'కాశ్మోరా' గా శ్రుతి హాసన్: భయపెడుతూ నవ్విస్తుంది

By Srikanya

చెన్నై : శ్రుతి హాసన్ కూడా త్వరలో భయపెట్టబోతోంది. 'కాశ్మోరా' అంటూ రెచ్చిపోనుంది. అయితే కామెడీతో నవ్విస్తూ భయపెడతానంటోంది. దానికి తోడు కార్తి వంటి స్టార్ హీరో కూడా కలిసిరావటంతో ఆమె పని సులభమవుతోంది. శ్రుతి భయపెడితే, కార్తి చేష్టలతో కామెడీ చేస్తాడంటున్నారు. వీరి ఇద్దరి కాంబినేషన్ లో చిత్రం రూపొందనుంది. వడివేలు ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ పాత్రను పోషించనున్నారు.

ఇది హర్రర్ కామిడిల సీజన్. భాక్సాపీస్ వ్దద్ద ఆ చిత్రాలకు సక్సెస్ రేటు బాగుండటంతో అలాంటి చిత్రం చేయాలనే హీరో,హీరోయిన్స్ ఉత్సాహం చూపుతున్నారు. తక్కువ చిత్రాలతో ఎక్కువ పేరు సొంతం చేసుకున్న నటుడు కార్తీ. ఆయన నటించిన 'మెడ్రాస్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టారాయన.

Karthi is ' Kashmora' of Shruthi Hassan

విజయ్‌సేతుపతి నటించిన 'ఇదక్కుతానే ఆశపట్టాయ్‌ బాలకుమారా' దర్శకుడు గోకుల్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో కార్తీ హీరోగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ తొలిసారి ఆయనతో జతకడుతోంది. ఈ చిత్రానికి కాశ్మోరా అనే టైటిల్ పెట్టారు.

ఇప్పటికే కార్తీ సోదరుడు సూర్యతో '7మ్‌ అరివు'లో శ్రుతి నటించింది. ఇప్పుడు తమ్ముడితో డ్యూయెట్లు పాడేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను స్టూడియోగ్రీన్‌ సంస్థ నిర్మిస్తోంది. కథ ప్రకారం ఇందులో హీరోయిన్ ది ఆధునిక పాత్ర కావడంతో.. శ్రుతిని ఎంచుకున్నట్లు దర్శకుడు చెప్పారు. ఈ ఏడాది కాల్షీట్‌ లేకపోయినా.. సర్దుకుని ఇందులో నటించేందుకు అంగీకరించారట శ్రుతి. ప్రస్తుతం ఆమె తమిళంలో విశాల్‌కు జంటగా 'పూజై' చిత్రంలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X