తమన్నాకు హ్యాండ్ ఇచ్చి రంజనిని వివాహం చేసుకుంటున్నాడు
తమన్నాతో గత రెండేళ్ళుగా ప్రేమ వ్యవహారాలు నడిపిన తమిళ హీరో కార్తీ త్వరలో పెళ్ళి కొడుకు అవుతున్నాడు. తమిళనాడులోని ఈరోడ్‌కి చెందిన రంజనితో వివాహం నిశ్చయమైంది. కార్తి తండ్రి, నటుడు శివకుమార్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇది పెద్దలు నిర్ణయించిన వివాహమే అని చెప్పారు. జులై 3న పెళ్లి జరిపేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఇక కార్తీ సినిమాలు తమిళానికే కాక ఇక్కడ కూడా టార్గెట్ చేస్తున్నారు. అతని 'ఆవారా', 'యుగానికొక్కడు' చిత్రాలు తమిళం కన్నా తెలుగులోనే బాగా ఆడాయి. ఇక తమన్నా విషయానికి వస్తే ఆమెతో ఆవారా చిత్రం సమయం నుంచీ లవ్ ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వచ్చాయి. అంతేగాక వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని కూడా చెప్పుకున్నారు. అయితే మీడియా వద్ద వీరిద్దరూ తాము కేవలం స్నేహితులమేనని ఆ వార్తలను ఖండించారు.


Click it and Unblock the Notifications











