పదికోట్లు ఇవ్వండి..నేను మహాత్ముడ్ని కాదు
నేను మహాత్ముడ్ని కాదు(నాన్ మహాన్ ఇల్లే) అంటూ ముందుకొస్తున్న సూర్య తమ్ముడు కార్తీ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ కోసం పదికోట్లు డిమాండ్ చేస్తున్నారుట. అదేంటి తెలుగులో విడుదలైన మీ రెండు చిత్రాలు యుగానికొక్కడు, ఆవారాలు అంతంత మాత్రంగానే ఆడాయి కదా అంటే..అందుకే కదా డిమాండ్ ఉన్న హీరోయిన్ కాజల్ ని నా ప్రక్కన పెట్టుకుంది అని సమాధానమిస్తున్నాట్ట. ఇక తన అన్న సూర్య యముడు చిత్రం బి, సి సెంటర్లలలో బాగానే కలెక్టు చేసిందని, అలాగే తన చిత్రం కూడా ఆడుతుందని హామీలు ఇస్తున్నాడుట. వీటికి తోడు రజనీకాంత్ చిత్రం ముప్పై కోట్లకు తెలుగు రైట్స్ తీసుకుంటున్నారట కదా అని కూడా టాపిక్ తెస్తున్నాడని తెలుస్తోంది. డబ్బింగ్ సినిమా కొందాం నాలుగు రాళ్ళు వెనకేసుకుందామనుకునే వారికి ఈ మాటలుకు సౌండ్ లేకుండా పోతోందిట. ఎందుకంటే పదికోట్లు పెడితే ఓ మాదిరి హీరోతో స్ట్రైయిట్ చిత్రం నిర్మించేయవచ్చు కదా అని ఆలోచిస్తున్నారట. ఇక ఈ చిత్రం ఆగస్టు ఇరవైన తమిళంలో రిలీజ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











