భార్యతో కనీసం ఫోన్‌లో మాట్లాడే టైమ్ కూడా లేదంటూ ఆ హీరో
తనకు కాబోయే భార్యతో కనీసం ఫోన్‌లో మాట్లాడే సమయం కూడా దొరకడం లేదంటూ కార్తీ ఫీలయిపోతున్నారని తమిళ పత్రికలు రాస్తున్నాయి. నిజమేనా అని మీడియావారు అడిగితే ముసి ముసినవ్వులతో సమాధానమిచ్చాడు. తమన్నాతో గత రెండేళ్ళుగా ప్రేమ వ్యవహారాలు నడిపిన తమిళ హీరో కార్తీ త్వరలో పెళ్ళి కొడుకు అవుతున్నాడనే సంగతి తెలిసిందే. తమిళనాడులోని ఈరోడ్‌కి చెందిన రంజనితో వివాహం నిశ్చయమైంది. ఇది పెద్దలు నిర్ణయించిన వివాహమే అని చెప్పారు. జులై 3న పెళ్లి జరిపేందుకు ముహూర్తం ఖరారు చేశారు. అలాగే కార్తీ ప్రస్తుతం శకుని చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో కార్తీ కొత్త కోణంలో కన్పిస్తారని వినికిడి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సంధించబోతున్న వ్యంగ్యాస్తమ్రే ఈ శకుని చిత్రం అని తెలుస్తోంది. కొత్త దర్శకుడు శంకర్ దయాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై అటు పరిశ్రమలోనూ, ఇటు అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











