Sardar: ఈసారి కార్తీ సినిమాకి డిమాండ్ మామూలుగా లేదు.. అక్కడ కూడా భారీ రిలీజ్

టాలెంటెడ్ తమిళ హీరో కార్తీ సర్దార్ అనే మరొక విభిన్నమైన సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న కార్తీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తన ప్రతి సినిమాను కూడా భారీ స్థాయిలోనే విడుదల చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఇక్కడ ప్రమోట్ చేసే విధానం కూడా తనకు బాగా కలిసి వస్తుంది.

కార్తీ ఎలాంటి సినిమా చేసినా కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అందుకే అతను టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే చాలా బాగా ఇష్టపడతు ఉంటాడు. కార్తీ నటించిన ఖైదీ సినిమా తెలుగులో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోగా ఆ తర్వాత సుల్తాన్ కూడా పర్వాలేదు అనే విధంగా ఓపెనింగ్స్ అయితే అందుకుంది. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే సర్దార్ సినిమా పైనే ఉంది.

PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక విభిన్నమైన క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. రఫ్ లుక్ తో ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తిగా కార్తీక్ తనను కొత్తగా ప్రజెంట్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది.

karthi new upcoming movie sardar kerala theatrical rights acquired fortune cinemas

తప్పకుండా సర్దార్ సినిమా సక్సెస్ అవుతుంది అని మిగతా భాషల్లో కూడా భారీగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ యాక్షన్ కాప్ స్టోరీనీ కేరళలో కూడా భారీగానే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. కేరళ థియేట్రికల్ హక్కులను ఫార్చూన్ సినిమాస్ అనే సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. అక్కడ ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.

అసలైతే దసరా సమయంలోనే సర్దార్ సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద పోటీ ఎక్కువగా ఉండడంతో ప్రణాళికలో ఒక్కసారిగా మార్చేశారు. అందుకే దీపావళికి విడుదల చేయాలని ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి వాయిదా వేయకుండా దీపావళికి సర్దార్ సినిమాను సౌత్ ఇండస్ట్రీలో భారీగా విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X