హిట్ కోసం తెలుగు హీరోల స్ట్రాటజీనే కార్తీ కూడా...
ఈ నేఫద్యంలో కార్తీ విజయం కోసం తహతహలాడుతున్నాడు. హిట్ అనివార్యమైన నేపథ్యంలో సినిమాల సంఖ్య కూడా పెంచాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'బిరియాని'లో నటిస్తున్నాడు. చివరి దశలో ఉంది. మరోవైపు రాజేష్ దర్శకత్వంలో 'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' చేస్తున్నాడు. మరో కొత్తకథకు కూడా పచ్చజెండా వూపినట్లు సమాచారం.
'అట్టకత్తి'లాంటి వైవిధ్య చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రంజిత్. స్టార్ హీరోలు లేకున్నా ప్రేక్షకులను మెప్పించటంలో విజయవంతమైంది. రంజిత్ దర్శకత్వంలో కార్తీ నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 'సాప్పాట్టు పరంబరై' అన్న పేరు ఖరారు చేసినట్లు సమాచారం.
'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' తర్వాత కార్తీ నటించే కొత్త సినిమా ఇదేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవనున్నాయి. ఈ చిత్రాన్ని సైతం తెలుగు,తమిళ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












