మళ్లీ ద్విపాత్రాభినయం...భయపెడతాడంట

By Srikanya

చెన్నై : 'పరుత్తివీరన్‌' చిత్రంతో తన ప్రత్యేకతను చాటుకున్న హీరో కార్తి. తండ్రి శివకుమార్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరపైకి వచ్చినా.. తొలి చిత్రంలోనే వైవిధ్యమైన నటనను ప్రదర్శించి.. యావత్‌ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'పయ్యా', 'సిరుత్త్తె'.. వంటి సినిమాలతో కమర్షియల్‌ హీరోగా మారారు.

ప్రస్తుతం ఉత్తర చెన్నై యాసతో 'మెడ్రాస్‌' చిత్రంలో నటించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా గతంలో కార్తి 'సిరుత్త్తె'లో ద్విపాత్రాభినయంతో అలరించారు. మళ్లీ అలాంటి వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు. 'ఇదుక్కుతానే ఆశపట్టాయ్‌ బాలకుమారా' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన గోకుల్‌ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటించడానికి సంతకాలు చేశారు కార్తి.

Karthi to play a dual role in Kashmora

కార్తి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి 'కష్మోరా' అని టైటిల్‌ పెట్టారు. సినిమా గురించి గోకుల్‌ మాట్లాడుతూ.. కార్తి ద్విపాత్రాభినయం పోషిస్తున్న విషయం నిజమే. కానీ.. వాటి వివరాలను ప్రస్తుతం గోప్యంగా ఉంచాం. 'కష్మోరా' అనేది ఓ వ్యక్తి పేరు. ఇందులో వడివేలు హాస్య పాత్ర పోషించనున్నారు. సెప్టెంబరులో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌తో చర్చలు జరుపుతున్నాం' అని చెప్పకొచ్చారు.

ఇది హర్రర్ కామిడిల సీజన్. భాక్సాపీస్ వ్దద్ద ఆ చిత్రాలకు సక్సెస్ రేటు బాగుండటంతో అలాంటి చిత్రం చేయాలనే హీరో,హీరోయిన్స్ ఉత్సాహం చూపుతున్నారు. తక్కువ చిత్రాలతో ఎక్కువ పేరు సొంతం చేసుకున్న నటుడు కార్తీ. ఆయన నటించిన 'మెడ్రాస్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టారాయన.

విజయ్‌సేతుపతి నటించిన 'ఇదక్కుతానే ఆశపట్టాయ్‌ బాలకుమారా' దర్శకుడు గోకుల్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో కార్తీ హీరోగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ తొలిసారి ఆయనతో జతకడుతోంది. ఈ చిత్రానికి కాశ్మోరా అనే టైటిల్ పెట్టారు.

ఇప్పటికే కార్తీ సోదరుడు సూర్యతో '7మ్‌ అరివు'లో శ్రుతి నటించింది. ఇప్పుడు తమ్ముడితో డ్యూయెట్లు పాడేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను స్టూడియోగ్రీన్‌ సంస్థ నిర్మిస్తోంది. కథ ప్రకారం ఇందులో హీరోయిన్ ది ఆధునిక పాత్ర కావడంతో.. శ్రుతిని ఎంచుకున్నట్లు దర్శకుడు చెప్పారు. ఈ ఏడాది కాల్షీట్‌ లేకపోయినా.. సర్దుకుని ఇందులో నటించేందుకు అంగీకరించారట శ్రుతి. ప్రస్తుతం ఆమె తమిళంలో విశాల్‌కు జంటగా 'పూజై' చిత్రంలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X