twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చూసారా?: సూర్య,కార్తీ కేక పెట్టించారు (ఫొటోలు)

    By Srikanya
    |

    చెన్నై : 'అట్టకత్తి' ఫేం రంజిత్‌ దర్శకత్వంలో కార్తి హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం 'మెడ్రాస్‌'. ఉత్తరచెన్నై నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేథరిన్‌ కథానాయిక. రితిక, కలైఅరన్‌, రమ, నందకుమార్‌ తదితరులు నటిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతంలోని ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగింది.

    కార్తీ, ఆయన అన్న సూర్య, తండ్రి శివకుమార్ తో వేడుక సరదాసరదాగా సాగిపోయింది. అన్నదమ్ములూ ఒకే చోట కనపడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. మద్రాస్ సినిమా సూపర్ హిట్ అన్న నమ్మకం అందరిలో కలుగుతోంది.

    కార్యక్రమానికి కార్తి తండ్రి శివకుమార్‌ అతిథిగా హాజరయ్యారు. నటుడు సూర్య, కేథరిన్‌, 'గానా' బాలా, సంతోష్‌ నారాయణన్‌ తదితరులు హాజరయ్యారు. సూర్య,కార్తీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

    అవిష్కరణ

    అవిష్కరణ

    నటుడు కార్తి ఆడియోను ఆవిష్కరించగా శివకుమార్‌ తొలి సీడీని అందుకున్నారు.

    సూర్య మాట్లాడుతూ..

    సూర్య మాట్లాడుతూ..

    ఈ కొత్త యువ యూనిట్‌ను చూస్తుంటే నాకే ఆశ్చర్యమేస్తోంది. తప్పకుండా ఎంతో సరదాగా సినిమాను పూర్తి చేసుంటారని తెలుస్తోంది. అదే ఉత్తేజంతోనే ఈ సినిమా విజయమవుతుంది. ట్రైలర్‌ను చూస్తే చాలా ఆనందంగా ఉంది. 'పరుత్తివీరన్‌', 'సుబ్రమణ్యపురం' సినిమా వరుసలో ఈ సినిమా కూడా నిలుస్తుందనడంలో సందేహం లేదు. తప్పకుండా కార్తిని మరో కోణంలో ప్రేక్షకులు చూడనున్నారని తెలిపారు.

    హీరో కార్తి ప్రసంగిస్తూ...

    హీరో కార్తి ప్రసంగిస్తూ...

    మెడ్రాస్‌ (చెన్నై) గురించి నాకు పూర్తిగా తెలియదు. అయితే ఈ సినిమాలో నటించేటప్పుడు ఉత్తర చెన్నై గురించి అర్థమైంది. ఇక్కడి ప్రజలు, యువకులు ఎలా జీవిస్తున్నారో తెలిసింది. ఈ సినిమాలో అలాంటి పాత్ర చేసేందుకు నన్ను నేను చాలా మార్చుకున్నా. చాలా వదులుకున్నా కూడా. ఒకే రకమైన పాత్రల్లో నటించి బోర్‌ కొట్టేసింది. అందుకే ఇలాంటి భిన్నమైన కథను ఎంచుకున్నానని అన్నారు.

    శివకుమార్‌ మాట్లాడుతూ..

    శివకుమార్‌ మాట్లాడుతూ..

    ఓ మంచి చిత్ర కళాకారుడు కావాలన్నదే నా తపన. ఆ పేరు కోసమే పల్లెనుంచి చెన్నైకి వచ్చాను. ఏడేళ్ల పాటు పలు చిత్రాలను వేశాను. కానీ నాకే తెలియకుండా.. నా జీవితం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కాదనలేకపోయా. దాదాపు 40 ఏళ్ల పాటు 192 సినిమాల్లో నటించా. నా సినీ కెరీర్‌ మొత్తం కలిసినా.. నా ఏడేళ్ల చిత్రలేఖన జీవితానికి సరిరాదు! కానీ దేశంలో చిత్రకారుడికి మంచి గుర్తింపు లేదనే పలువురి వాదన నిజమనిపిస్తుంది.

    శివకుమార్ కంటిన్యూ చేస్తూ...

    శివకుమార్ కంటిన్యూ చేస్తూ...

    ఇంటాబయటా కార్తి 'మెడ్రాస్‌' సినిమా గురించే మాట్లాడేవాడు. ఓ రోజు చిత్రీకరణ స్పాట్‌కు వెళ్తే.. వారి ఆనందాన్ని చూసి ఉప్పొంగిపోయా. ఎంతో సరదాగా సినిమాను పూర్తి చేశారు. భిన్నమైన శైలితో తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పారు.

    దర్శకుడు

    దర్శకుడు

    అట్టకత్తి ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పుటికే విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకుముందు ఈ చిత్రానికి కాళి అండ్ కబాళి అనే టైటిల్ పెట్టారు. కానీ మద్రాస్ టైటిల్ బాగుంటుందని ఖరారు చేసి ఫస్ట్ లుక్ వదిలారు.

    బ్యాక్ డ్రాప్

    బ్యాక్ డ్రాప్

    ఈ 'మద్రాస్ ' చిత్రం రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. నా పేరు శివ తరహాలో ఈ చిత్రం ఆకట్టుకుంటుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

    తెలుగులోనూ..

    తెలుగులోనూ..

    అవారాతో తెలుగులోనూ అదరకొట్టిన కార్తీ ఈ చిత్రాన్ని ఇక్కడా రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక కార్తీ సినిమాలు తెలుగులో వరస ఫ్లాఫులు కావటంతో ఇక్కడ బిజినెస్ సైతం డల్ అయ్యింది. అయితే మరో ప్రక్కన 'ఆల్‌ఇన్‌ఆల్‌ అళగురాజా' ని డబ్బింగ్ చేసి వదలాలని ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    The audio of Karthi's upcoming film "Madras" was released in an event held in Taj, Chennai. Suriya, Karthi, Sivakumar, Catherine Tresa, director Pa. Ranjith, producer KE Gnanavel Raja, singer Gana Bala, cinematographer G.Murali and editor Praveen K.L among others graced the audio launch event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X