రవితేజని ఇమిటేట్ చేయగలిగాడు కానీ రాజమౌళి టెక్నిక్స్ కి బోర్లాపడ్డాడు
రవితేజ నటించిన యాక్షన్ ఫిలిం 'విక్రమార్కుడు" తెలుగులో భారీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుందన్న విషయం విదితమే. రవితేజ, రాజమౌళిల పవర్ ఫుల్ కలయిక విజయానికి ముఖ్య కారణం అయితే రాజమౌళి కథానుగుణంగా నడిపిన యాక్షన్ ట్రాక్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇక అనుష్క అందాల ఆరబోత ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టి చంపేసింది. ఇదే ఫార్ములాను తమిళంలో 'సిరుతై" రీమేక్ చేయబోయి బొక్కబోర్లా పడ్డాడు హీరో కార్తి, ఆ చిత్ర దర్శకుడు శివ. సంక్రాంతి కానుకగా విడుదలైన 'సిరుతై"ని మొత్తంగా ప్రేక్షకులు రిజక్ట్ చేయకపోయినా కార్తీ గత సినిమాలతో పోలిస్తే ఖచ్చితంగా ప్లాపేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
యాక్షన్ ని అచ్చం రవితేజలా ఇమిటేట్ చేయటం, డైలాగులు ఉన్నది ఉన్నట్టుగా తర్జుమా చేయటంతో ఎఫెక్టు బాగా తగ్గిందన్నది ఒక వాదనైతే..ఇదంతా పాత కథే కదా అన్నది మరో వాదన. కథేదైనా చెప్పేవాడిలో దమ్ముండాలి చెప్పించే వాడిలో సత్తా ఉండాలి. ఎవరికి వారు గొప్పగా ఫీల్ అయిపోయినంత మాత్రాన అందరు రాజమౌళిలు కాలేరు కదా? అన్నది ఫర్ఫెక్టు లాజిక్కు..


Click it and Unblock the Notifications











