Japan Trailer: ఊహించని విధంగా జపాన్ ట్రైలర్.. సింహం కాస్త సిక్ అయితే..!
విలక్షణమైన నటనను కనబరుస్తూ.. విభిన్నమైన సినిమాలు చేస్తూ దక్షిణ భారతదేశం మొత్తంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌తో సత్తా చాటుతోన్నాడు తమిళ స్టార్ హీరో కార్తి. పేరుకు కోలీవుడ్‌కు చెందిన హీరోనే అయినా.. దక్షిణాది మొత్తంలో మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఈ బడా హీరో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.
ఈ మధ్య కాలంలో డీసెంట్ హిట్లతో సత్తా చాటుతోన్న కార్తి ఇప్పుడు 'జపాన్' అనే మూవీలో నటిస్తున్నాడు. ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని 'జోకర్', 'మండేలా' ఫేం రాజు మురుగన్ తెరకెక్కిస్తున్నాడు. కార్తి 25వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

కార్తి నటిస్తోన్న 'జపాన్' మూవీని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ముమ్మరం చేసేస్తోంది. ఇలా ఇప్పటికే దీని నుంచి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వీటికి కార్తి అభిమానులతో పాటు అన్ని వర్గాల వాళ్ల నుంచి మంచి స్పందన వచ్చింది.
క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న 'జపాన్' మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ శనివారం రాత్రి విడుదల చేసింది. ఇందులో హీరో తన కథను చెప్పుకుంటూ కనిపించాడు. ముఖ్యంగా ఈ ట్రైలర్‌లో హీరో ఎలివేషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ అదిరిపోయాయి. ప్రత్యేకంగా కార్తి బాడీ లాంగ్వేజ్, మాట్లాడిన యాస సూపర్‌గా ఉన్నాయి. మొత్తంగా ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఇదిలా ఉండగా.. 'జపాన్' చిత్రాన్ని 2009లో చెన్నైలోని లలిత జ్యూయెలరీ షోరూంలో ఏకంగా రూ. 13 కోట్లు విలువైన బంగారాన్ని దొంగిలించి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిన గజదొంగ మురుగన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అయితే, నిజ జీవితంలో ఈ దొంగ మరణించగా.. ఈ సినిమాలో మాత్రం హీరో పాత్రను సజీవంగా ఉంచబోతున్నారని తెలుస్తోంది.
ఇక, 'జపాన్' మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో అను ఇమాన్యూయేల్ హీరోయిన్‌గా నటిస్తోండగా సునీల్ కీలక పాత్రను చేస్తున్నాడు. ఇక, ఈ క్రేజీ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











