తమన్నా పయ్యా (తెలుగు 'ఆవారా') చిత్రం రిజల్ట్ ఏంటి?
తమన్నా, కార్తీ కాంబినేషన్లో లింగు స్వామి రూపొందించిన ఆవారా తమిళ వెర్షన్ పయ్యా క్రిందట వారం రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ ఫన్, ప్రేమ, పాటలు వర్కవుట్ అయినా సెకెండాఫ్ పోస్ట్ ఇంటర్వెల్ సన్నివేశాలు బాగా నిరాశపరిచాయని చెన్నై వార్త. తనే గతంలో తీసిన పందెం కోడి, విజయ్ గిల్లీ(ఒక్కడు)లోని సన్నిశాలను రిపీట్ చేయటం కొంత ఇబ్బంది కలిగించాయంటున్నారు. దాంతో కథ ప్రెడిక్టిబుల్ గా తయారైంది.
ఆవారాగా తిరిగే శివ(కార్తి)ఓ ఇంటర్వూ నిమిత్తం బెంగుళూరు వస్తాడు. అక్కడ తన క్లోజ్ ప్రెండ్స్ తో తిరుగుతూంటే చారు(తమన్నా)తగులుతుంది. కామన్ గానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అంతేగాక కలలు కని పాటల పాడి ఎంజాయ్ చేస్తూంటాడు. హఠాత్తుగా ఓ రోజు ఆమె పలకరించి తనని ముంబయి తీసుకుపొమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. విషయం ఏమిటీ అని ఆరా తీస్తే ఆమె సవతి తల్లి తన తమ్ముడుని చేసుకోమని బలవతం పెడుతోందని తెలుస్తుంది. అప్పుడు శివ ఆమెను తీసుకుని ముంబయి ప్రయాణం పెట్టుకుంటాడు.హైవే మీద వెళ్థూంటే వాళ్లని రౌడీలు వెంబడించి ఎటాక్ చేస్తూంటారు. తన తెలివి తేటలతో డ్రైవింగ్ ఎక్సిపీరియన్స్ తో వేరే రూటులో ముంబయి ప్రయాణం చేస్తూంటాడు శివ. ఈ లోగా మరో గ్యాంగ్ ఎటాక్ చేస్తుంది. వాళ్ళు ముంబయి నుంచి వచ్చిన వాళ్ళు. అయితే వాళ్ళు శివని టార్గెట్ చేస్తారు. వాళ్ళు చారు ని వదిలేస్తారు. వాళ్ళతో ఫైట్ చేసిన తర్వాత శివ వాళ్ళెవరు...ముంబైతో తనకు ఉన్న సంభందం ఏమిటన్నది ఫ్లాష్ బ్యాక్ వివరిస్తాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద ఫైట్స్ చేస్తూ ఆ గ్యాంగ్ లనుంచి తప్పించుకుంటూ ఎలా శివ తన ప్రేమని సక్సెస్ చేసుకున్నాడని మిగతా కథ.
ఏదైమైనా ఈ సినిమాలో బాగుంది అంటే తమన్నా నైస్ లుక్స్ అంటున్నారు. సెకెండాఫ్ లో వచ్చే ట్విస్ట్లు చిన్న పిల్లాడుకూడా ఊహించేలాగ ఉండటమే చిత్రాన్ని దెబ్బ తీసింది అంటున్నారు. అయితే బి, సి సెంటర్లపై ఈ చిత్ర నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. మరి తమిళంలో ఈ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగులో ఎలా వర్కవుట్ అవతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











