అభిమాని మరణం.. అంతిమ యాత్రలో కన్నీరు పెట్టుకున్న హీరో

హీరోలకు అభిమానులే దేవుళ్లు.. అభిమానులకు హీరోలే ఆరాధ్య దైవాలు. వీరిద్దరి అవినాభావ సంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అభిమానులను అలరించేందుకు హీరోలు ఎంతగానో కష్టపడుతూ ఉంటే.. తమ హీరోల కష్టసుఖాల్లో వెనువెంటే ఉంటారు ఫ్యాన్స్. తమిళంలో అయితే హీరోలకు గుళ్లు కూడా కట్టేసి పూజిస్తుంటారు. అంతటి అభిమానులను సంపాదించుకునే తమిళ హీరో.. అభిమానుల పట్లే అంతే బాధ్యతను చూపుతారు.

 మరణానికి కుంగిపోయిన హీరో..

మరణానికి కుంగిపోయిన హీరో..

తాజాగా ఓ అభిమాని మరణాన్ని హీరో కార్తీ తట్టుకోలేక పోయాడు. ఆ వార్త తెలిసిన వెంటనే కార్తీ కన్నీటి పర్యంతమయ్యాడు. అతడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చి కార్తీ.. భౌతిక కాయాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

ఇష్టమైన అభిమాని..

ఇష్టమైన అభిమాని..

కార్తీ మక్కల్‌ నాలా మండ్రం పేరిట ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన వ్యాసై అంటే కార్తీకి కూడా ఎంతో అభిమానం. రోడ్డు ప్రమాదంలో వ్యాసై మరణించడంతో కార్తీ.. అతడి భౌతిక కాయానికి నివాళులు అర్పించాడు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాడు.

 మౌనం పాటించిన హీరో..

మౌనం పాటించిన హీరో..

కార్తీ ప్రస్తుతం దొంగ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోన్న సంగతి తెలిసిందే. నిజ జీవితంలో వదిన అయిన జ్యోతిక ఈ చిత్రంలో అక్కగా నటిస్తుండగా.. ఆ మధ్య విడుదలైన టీజర్‌కు ఎంతటి స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే. డిసెంబర్‌లో విడుదల కానున్నఈ మూవీ ఆడియో వేడుకల్లో అభిమాని మరణం గురించి వివరించి మౌనం పాటించాలని కోరాడు.

Recommended Video

Arjun Suravaram Movie Review | Samantha In Family Man Season 2
ఖైదీతో సూపర్ హిట్..

ఖైదీతో సూపర్ హిట్..

రీసెంట్‌గా కార్తీ ఖైదీ అనే చిత్రంలో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కార్తీ సినీ కెరీర్‌లోనే మొట్టమొదటి వంద కోట్ల చిత్రంగా ఖైదీ నిలిచింది. కమర్షియల్ హంగులు అద్దకుండా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X