కార్తీ సినిమా కోసం బిగెస్ట్ సెంట్రల్ జైల్.. మొదటిసారి అంతకుమించి అనేలా..
కోలీవుడ్ స్టార్ కార్తీ తమిళ్ లో ఎలా అయితే హిట్స్ అందుకుంటున్నాడో దాదాపు తెలుగులో కూడా అదే రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్నాడు. ఇక్కడ మీడియం రేంజ్ హీరోల మాదిరిగా కార్తీ సాలీడ్ ఓపెనింగ్స్ అందుకుంటూ ఉంటాడు. ఇక సుల్తాన్ సినిమాతో పరవాలేదు అనిపించిన కార్తీ నెక్స్ట్ అంతకుమించి అనేలా రెడీ అవుతున్నాడు.
నిజానికి సుల్తాన్ సినిమాను కార్తీ కెరీర్ లోనే అత్యదిక బఫ్జెట్ తో నిర్మించారు. కరోనా కాస్త తక్కువయ్యి ఉంటే ఆ సినిమా ఇంకాస్త మంచి వసూళ్లను అందుకునేది. అసలు మ్యాటర్ లోకి వస్తే కార్తీ నెక్స్ట్ సినిమా కూడా భారీ స్థాయిలోనే తెరకెక్కుతున్నట్లు సమాచారం. పిఎస్.మిత్రన్ దర్శకత్వంలో సర్ధార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సర్దార్ సినిమాలో కార్తీ ఒక పవర్ఫుల్ క్రిమినల్ గా కనిపించబోతున్నాడట. ఆ సినిమాకు సంబంధించిన సగం సన్నివేశాలు జైలు బ్యాక్ డ్రాప్ లోనే ఉంటాయట. ముందు నిజమైన జైలులోనే షూట్ చేయాలని అనుకున్నారు. కానీ పర్మిషన్ దొరకకపోవడంతో ఏకంగా సెంట్రల్ జైలు సెట్ వేశారు. కోట్ల రూపాయలతో నిర్మించిన ఆ సినిమా హైలెట్ గా నిలవనుందట. ఇక కార్తీ సరసన హీరోయిన్ రాశిఖన్నా కథానాయికగా నటిస్తుండగా సినిమాకు జీవి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











