తెలుగు హీరోలను భయపెడ్తున్న తమిళ హీరో
తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ తాజా చిత్రం 'నా పేరు శివ"మొన్న శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం విజయోత్సవరం రీసెంట్ గా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిపారు. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ.. త్వరలో తెలుగులో స్ట్రెయిట్ చిత్రం చేయబోతున్నా. ఈ సినిమా విజయం చూసిన వారందరూ ఇక మకాం హైదరాబాద్‌కు మార్చాలని అంటున్నారు అన్నారు. అతి తక్కువ కాలంలోనే తెలుగు హీరోలకు ధీటుగా మార్కెట్ విస్తరించుకున్న సూర్య స్ట్రైయిట్ తెలుగు సినిమాను తెలుగు డైరక్టర్ తోనే చేస్తారా లేక తమిళ డైరక్టర్ తో చేస్తారా అనేది చూడాలి. అయితే కార్తీ డేట్స్ ఇస్తే చెయ్యటానకి తెలుగులో పెద్ద దర్శకులు సైతం రెడీగా ఉన్నారు. నిర్మాతలైతే అడ్వాన్స్ లతో కార్తీ ని సంప్రదించటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దాంతో తెలుగు యువ హీరోలు చాలా మంది ఈ విషయమై డిస్కస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలోనూ యుగానికి ఒక్కడు, ఆవారా చిత్రాలు తమిళ కన్నా తెలుగులోనే బాగా ఆడటం కూడా కార్తికి తెలుగు ఎంట్రీకి ఊతమిస్తోంది. ఇక కార్తీ చేయబోయే చిత్రానికి ఛత్రపతి ప్రసాద్ నిర్మించనున్నట్లు.. ప్రస్తుతం చర్చలు స్ధాయిలో ఉన్నట్లు వినికిడి.


Click it and Unblock the Notifications











