మణిరత్నం అగ్నినక్షిత్రం(ఘర్షణ),మౌనరగం వంటి సినిమాలో హీరోగా చేసిన నటుడు కార్తీక్ ఇప్పడు ఆయన సినిమాలోనే విలన్ గా చేస్తున్నాడని తెలుస్తోంది.రామాయణం ఆధారంగా ఆయన భారీగా తీయబోతున్న చిత్రంలో ఈ విచిత్రం జర్గుతోంది.ఈ మధ్య కార్తీక్ సినిమాలు ఏమీ చేయక రెస్ట్ లో ఉన్నారు.అయితే సెకెండ్ ఇన్నింగ్స్ ఎలా ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు మణిసార్ నుండి ఈ ఆఫర్ వచ్చిందిట.ఈ సినిమా తమిళ,తెలుగు వెర్షన్స్ లో విక్రమ్ ,ఐష్ జంటగా చేయనునున్నారు. ఇక హిందీ వెర్షన్ లో అభిషేక్ బచ్చన్,ఐష్ చేయనున్నారనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కార్తీక్ రోల్ వర్కవట్ అయితే మన తెలుగులో సుమన్ విలన్ ,క్యారెక్టర్ వేషాలు వేస్తున్నట్లు సెటిలవ్వచ్చనేది ఆయన ఊహట.