ఇళయరాజా పాటలతో కార్తీక్ రాజా కచేరి...డిటేల్స్
చెన్నై : సంగీత సామ్రాజ్యానికి తమ తండ్రి ఇళయరాజానే రారాజని కార్తీక్‌రాజా వ్యాఖ్యానించారు. పలు చిత్రాలకు సంగీతం సమకూర్చిన కార్తీక్‌రాజా త్వరలో కౌలాలంపూర్‌లో 'కింగ్ ఆఫ్ కింగ్స్' పేరిట సంగీత కచేరీ నిర్వహించనున్నారు. డిసెంబరు 28న ఈ సంగీత కచేరీ నిర్వహించనున్నారు.

ఈ విషయమై కార్తీక్ రాజా మాట్లాడుతూ.. ''నాన్న పాటలు వినే అందరూ పెరిగారు. సంగీత దర్శకులందరికీ ఆయనే ఆదర్శం. ఇప్పటికీ ఆ పాటలు వింటుంటే.. అందరికీ చిన్ననాటి, యువప్రాయంలోని విషయాలు గుర్తుకొస్తాయి. అన్ని సందర్భాలకూ బాణీలు సమకూర్చారు. విదేశాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. కౌలాలంపూర్‌లోని ప్రజల కోరిక మేరకు డిసెంబరు 28న సంగీత కచేరీ నిర్వహించనున్నాం'' అన్నారు.
అలాగే .. '' ఆయన వారసులుగా మాకు నచ్చిన పాటలను ఇందులో వినిపించనున్నాం. అదే ఈ కచేరీ ప్రత్యేకత. నాన్న కూడా పాల్గొంటారు. ఎస్పీబీ, మనో, చిత్ర, హరిచరణ్, షాలిని, రీటాతోపాటు పలువురు సంగీత దర్శకులు కూడా పాలుపంచుకోనున్నారు. 80వ దశకంలో రాజా పాటల్లో తెరపై కనిపించిన హీరోలు, హీరోలు కూడా పాల్గొంటారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్‌కూ ఆహ్వానం పంపాము''అని చెప్పారు.


Click it and Unblock the Notifications











