twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్తి వివాదంలో హీరో పోలీస్ కంప్లైంట్

    By Srikanya
    |

    చెన్నై: తెలుగులో అభినందన,మగరాయుడు చిత్రాలు ద్వారా పరిచయం అయిన కార్తీక్ ఆస్ధి వివాదంలో ఇరుక్కుని పోలీసులకు కంప్లైంట్ చేసారు. గత కొంతకాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న కార్తీక్ ఇలా హఠాత్తుగా మంగళవారం రాత్రి పోలీసులను కలిసారు. తను సంపాదించిన ఆస్ధి గురించి, దానిపై వచ్చిన సమస్యలపై పోరాడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ ఆస్తి తగాదాకు సంబంధించి కార్తీక్ అందజేసిన ఫిర్యాదుపై విచారణ జరుపనున్నట్లు తెలిపారు.

    Karthik Registered Complaint at Police

    వివరాల్లోకి వెళితే... కార్తీక్‌కు అతని కుటుంబీకులకు మధ్య ఆళ్వారుపేటలోగల ఇల్లు, ఇతర స్థలాలకు సంబంధించి కొంతకాలంగా తగాదాలు వున్నాయి. ఈ కారణంగా కొన్ని రోజుల క్రితం కార్తీక్ హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు. ప్రస్తుతం ఆయన విడిగా వుంటున్నట్లు సమాచారం. ఈ క్రమం లో కార్తీక్ మంగళవారం రాత్రి తేనాంపేట పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఒక కంప్లైంట్ రాసి సమర్పించారు. ఇందులో ఆస్తి తగాదా గురించిన వివాదాన్ని పరిష్కరించాలని కోరారు.

    డెరైక్టర్ భారతీరాజా 'అలైగళ్ ఓయ్‌వదిల్లై' అనే తమిళ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమైన కార్తీక్ తమిళంలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఘర్షణ వంటి చిత్రం ద్వారా ఇక్కడ కూడా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన అనేక డబ్బింగ్ చిత్రాలు ఇక్కడ ఆడాయి. రీసెంట్ గా కల్యాణ్ రామ్ చిత్రం ఓం లోనూ ఆయన కీలకమైన పాత్రను పోషించారు. అలాగే ఈయన కుమారుడు గౌతం కార్తీక్ కూడా ప్రస్తుతం హీరో కొనసాగుతున్నారు.

    English summary
    Tamil Hero Karthik registered complaint at Police.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X