జగం కోలుకున్న తరువాత.. థియేటర్స్‌లోకి‘జగమేతంత్రం’
అసురన్, పట్టాస్ వంటి చిత్రాలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు ధనుష్. సహజత్వానికి దగ్గర ఉండే కథలను ఎంచుకుంటూ.. తనలోని నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ధనుష్‌కు తమిళ నాట మాస్ ఫాలోయింగ్ ఉంది. వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతోన్న ధనుష్.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్‌తో ఓ సినిమాను చేస్తున్నాడు.
భిన్న చిత్రాలను తెరకెక్కిస్తాడని పేరున్న కార్తీక్ సుబ్బరాజు వంటి యంగ్ డైరెక్టర్‌తో ధనుష్ జగమే తంత్రం అనే చిత్రాన్ని చేస్తున్నాడు. కెరీర్‌లో 40వ చిత్రం చేస్తోన్న ధనుష్ మరోసారి ప్రయోగాత్మక చిత్రానికే ఓటు వేశాడని అర్థమవుతోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన టైటిల్ మోషన్ పోస్టర్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అయితే అన్నీ అనుకూలించి ఉంటే.. ఈపాటికే థియేటర్లలో సందడి చేసేది ఈ సినిమా.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా గుప్పిట్లోనే ఉంది. ఈ వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించారు. దీంతో అన్ని రంగాలు మూతపడ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి, రిలీజ్‌లు వాయిదా పడ్డాయి. ఈ విపత్కర పరిస్థితి నుంచి జగం కోలుకున్నాక.. థియేటర్స్‌లో జగమే తంత్రం విడుదలవుతుందని డైరెక్టర్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాను తెలుగు నాట గీతా ఆర్ట్స్, యూవీ సంస్థలు కలిసి డిస్ట్రిబ్యూట్ చేయనున్నాయి. ఈ చిత్రంలో సంతోష్ నారాయణ్ అందించే సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











