కుల పిచ్చిగాళ్ళకు చెప్పుదెబ్బ.. రజనీ దర్శకుడి సంచలన వ్యాఖ్యలు, ఆ సినిమా అద్భుతం!
పిజ్జా, మెర్కురీ లాంటి చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించిన కార్తీక్ సుబ్బరాజ్ ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం రజని నటిస్తున్న పెట్ట చిత్రానికి ఇతడే దర్శకుడు. పెట్ట చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పెట్ట చిత్రం కోసం సూపర్ స్టార్ ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా కార్తీక్ సుబ్బరాజ్ పరియరుమ్ పెరుమాళ్ చిత్రంపై స్పందించిన తీరు సంచలనంగా మారింది.

2018 ఉత్తమ చిత్రాలలో
గత కొంత కాలంగా పరియరుమ్ పెరుమాళ్ చిత్రం హాట్ టాపిక్ గా మారుతోంది. తమిళనాట ఈ చిత్రం గురించి విపరీతమైన చర్చ జరుగుతుండడం విశేషం. ఈ చిత్రంసెప్టెంబర్ 28న విడుదలైనా ఇంకా హీట్ తగ్గలేదు. మారి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. 2018 లో విడుదలైన ఉత్తమ తమిళ చిత్రాలలో పరియరుమ్ పెరుమాళ్ చిత్రం ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.

నిర్మాతగా కబాలి డైరెక్టర్
చిన్న సినిమాగా విడుదలైన పరియరుమ్ పెరుమాళ్ చిత్రం పెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రానికి కబాలి, కాలా చిత్రాల దర్శకుడు పా రంజిత్ నిర్మాత కావడం విశేషం. సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ వంటి ప్రముఖులంతా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

కులపిచ్చిగాళ్లకు చెప్పుదెబ్బ
తాజాగా పెట్ట దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ స్పందించాడు. చాలా ఆలస్యంగా పరియరుమ్ పెరుమాళ్ చిత్రాన్ని చూశా. అద్భుతమైన రచన, నటనతో పరియరుమ్ పెరుమాళ్ చిత్రం ఆకట్టుకుంది. కులపిచ్చి గాళ్ళకు ఈ చిత్రం ఒక చెప్పుదెబ్బ అంటూ కార్తీక్ సుబ్బరాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పరువు హత్యలు
తమిళనాడులో తిరునాళ్ వేలి అనే ప్రాంతంలో తరచుగా పరువు హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ అంశంతో పరియరుమ్ పెరుమాళ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖుల ప్రశంసలతో ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











