For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తల్లి రాధపై కూతురు కార్తీక కంప్లైంట్

  By Srikanya
  |
  చెన్నై : తన తల్లి పక్కనుంటే నటించటం కష్టమని అలనాటి అందాల నటి రాధ కుమార్తె, హీరోయిన్ కార్తీక అంటోంది. జోష్ తో తెలుగుకు పరిచయమైన కార్తీక కెరీర్ స్లోగా వెళ్లుతోంది. తొలి చిత్రం పరాజయం మిగల్చటంతో ఆమె తెలుగులో బిజీ కాలేకపోయింది. తర్వాత ఎన్టీఆర్ తో చేసిన దమ్ము సైతం ఆమెకు నిరాస మిగిల్చింది. అయితే తమిళంలో ఆమె చేసిన రంగం చిత్రం సక్సెస్ కావటంతో మెల్లిగా బిజీ అవుతోంది. అయితే తన కుమార్తెను ఎప్పుడూ తల్లి రాధ అంటిపెట్టుకునే ఉంటుంది. ఈ నేపధ్యంలో కార్తిక ఇలా కామెంట్ చేసింది.

  కార్తీక మాట్లాడుతూ.. మా కెరీర్‌కు సబంధించి అమ్మ ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తుంటుంది. అవి మాకెంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే షూటింగ్ ప్రదేశానికి అమ్మ వచ్చినప్పుడు నాకు చాలా కంగారుగా ఉంటుంది. ఒక సన్నివేశం చేస్తున్నప్పుడు.. అమ్మ చూస్తోందే.. బాగా నటించానో లేదో అన్న అనుమానం నా మదిని తొలుస్తూ ఉంటుంది అంది. అలాగే అమ్మ ముందు ప్రేమ, రొమాన్స్‌ సన్నివేశాల్లో నటించేందుకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది.

  అలాగే సినిమా బ్యాగ్రౌండ్ ఉండటం ఓ రకంగా మంచిదే. ఎందుకంటే సినిమాల్లో సులువుగా ప్రవేశించవచ్చు. కానీ దానివల్ల అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్తాయని, పెద్దగా కష్టపడకుండానే పేరు వచ్చేస్తుందని అంటే మాత్రం ఒప్పుకోను. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా, మనకంటూ సొంత ప్రతిభ ఉండాలి. మన నటనతో అందరినీ ఆకట్టుకోగలగాలి. అప్పుడే మంచి పేరు వస్తుంది.

  ఇక ఎక్స్‌పోజింగ్ అనేది ఎంతవరకూ చేస్తున్నామనేదాన్ని బట్టి ఉంటుంది. హద్దులు దాటనంత వరకూ ఏదైనా ఓకే. 'జోష్'లో గ్లామరస్‌గా కనిపించడానికి అవకాశం లేని పాత్ర నాది. కానీ 'రంగం'లో మోడ్రన్‌గా ఉండే అమ్మాయి పాత్ర. అందుకే ఓ పాటలో నేను కూడా కాస్త పొట్టిగా ఉన్న డ్రెస్ ఒకటి వేసుకున్నాను. కానీ అది ఎబ్బెట్టుగా లేదు కాబట్టి అందరూ బాగుందని చెప్పారు. ఏదో వేసేసుకోవాలని కాకుండా, ఎంతవరకూ నప్పుతుందో చూసుకుని వేసుకోవాలి. అప్పుడు ఏ సమస్యా ఉండదు అంది.

  అందాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే. కానీ షూటింగుల్లో బిజీగా ఉంటాం కాబట్టి ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లడం కుదరదు. ఒక్కోసారి అసలు వ్యాయామం చేయడానికి టైమే ఉండదు. అందుకే తీరిక దొరికినప్పుడే చేస్తుంటాను. అయినా నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. ఏమాత్రం సమయం దొరికినా డ్యాన్స్ చేస్తూనే ఉంటాను. అదే నాకు మంచి వ్యాయామం అంది.

  English summary
  Karthika who made foray into films with the disastrous flick 'Josh' opposite Naga Chaitanya blames her mom and veteran actress Radha for her downfall, despite making the right choices. "Radha was the dream girl of 80s youth. Being he daughter of Radha, everyone looked at me with pre-conceived notion. That's the reason why my career hasn't taken a flying start. I wish to make one thing clear - I'm no less to my contemporaries in any aspect. Please stop comparing me with my Mom," pleads the dusky siren, in her recent interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X