అసలు హీరోయిన్ లక్షణాలే లేని హీరోయిన్ బాలీవుడ్ పై మోజు..
తెలుగులో జోష్ సినిమాతో పరిచయమయిన రాధ కూతురు కార్తీకకి తొలి సినిమాతో పరాజయంతో పాటు విమర్శలు కూడా చాలా వచ్చాయి. అస్సలు హీరోయిన్ మెటీరియల్ కాదని, చూడ్డానికి అస్సలు బాగోలేదని కామెంట్స్ పడ్డాయి. అయితే తమిళ చిత్ర రంగానికి మకాం మార్చి అక్కడ 'కో" సినిమాలో నటిస్తే అది పెద్ద హిట్ అయింది. కానీ కార్తీకకి మాత్రం ఆ సినిమా వల్ల పైసా ప్రయోజనం లేకుండా పోయింది. తెలుగులో అలా, తమిళంలో ఇలా అయ్యే సరికి డీలా పడ్డ కార్తీక ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ మీదే దృష్టిపెడుతోంది.
'కో" చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి అక్షయ్ కుమార్ ఆసక్తి చూపుతున్నాడని, తెలిసి, తమిళంలో తను పోషించిన పాత్రని హిందీలో కూడా తనకే ఇస్తారమోనని కార్తీక అక్కడికెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అక్షయ్ కుమార్ ని కలిసి ఎలాగైనా, ఏం చేసయినా ఆ సినిమాలో నటించాలిన చూస్తోంది. మరి అక్షయ్ ఈ మాదిరి హీరోయిన్ కి పడిపోయిన్ అవకాశమిస్తాడనుకోవడం పిచ్చితనమే అనుకోవాలి.


Click it and Unblock the Notifications











