నా కూతురు కథలు నేనే వింటాను అంటున్న హీరోయన్ తల్లి
నా కుతురు కోసం స్క్రిప్టులు వింటున్నాను. కొన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నాయి. త్వరలోనే మా అమ్మాయి చేయబోయే సినిమాలు గురించి మీడియాకు తెలియచేస్తాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది ఒకప్పటి హీరోయిన్ రాధ. ఆమె కూతురు రాధ రీసెంట్ గా తమిళంలో కో అనే చిత్రంతో హిట్టు కొట్టింది. కో చిత్రం తెలుగులో రంగం పేరుతో రిలీజైంది. ఇక ఆ చిత్రం తర్వాత కార్తీకకు ఆఫర్స్ రావటం మొదలయ్యాయి. అయితే రాధ ఆ కథలను తానే వింటానని,తను ఓకే చేస్తేనే తన కూతురు చేస్తుందని ప్రకటించింది. దాంతో చాలా మంది కూతురుపై తల్లి పెత్తనం అని తిట్టుకుని వెనతిరుగుతున్నారు. ఈ విషయమై రాద మాట్లాడుతూ..నా కూతురు భవిష్యత్ నాకు ముఖ్యం. ఇది ఆమె కెరీర్ నిలబడటాని ఎన్నిక చేసుకునే కీలక సమయం. ఇటువంటి సమయంలో తీసుకునే నిర్ణయాలే ఆమె భవిష్యత్ ని నిర్ణయిస్తాయి. ఇలాంటి స్ధితిలో నా అనుభవంతో నా కూతురు కెరీర్ ని తీర్చిదిద్దాలనుకోవటంలో తప్పు లేదు కదా అని తేల్చేసింది.


Click it and Unblock the Notifications











