నాగచైతన్య హీరోయిన్ కి పెళ్ళి కుదిరింది
నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన కార్తీక(రాధ కూతురు) గుర్తుండే ఉంటుంది. ఆమెకు మ్యారేజ్ సెటిల్ అయిందని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తమిళ మీడియాతో మాట్లాడుతూ...సినిమా ఆఫర్స్ కంటిన్యూగా వస్తున్నప్పటికీ తాను వివాహం చెయ్యాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అలాగే తమ ఫ్యామిలీ సర్కిల్ లోని కుర్రాడినే ఎంపిక చేయనున్నట్లు చెప్పింది. ఇక ఒకటీ అరా సినిమాలు కార్తికకి వచ్చినా ఆమె ఒప్పుకోవటం లేదు.ఇక ఆమె మళయాళంలో ఆ మధ్యన 'మకరమన్జు'అనే చిత్రం కమిట్ అయ్యింది. అయితే ఈ చిత్రానికి ఓ స్పెషాలిటి ఉంది. ఈ చిత్రం ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ జీవితం ఆధారంగా రూపుదిద్దుకోబోతోంది. ఆ పాత్రకు ఓ ప్రత్యేక ఉంది. కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించాలి. ఇక ప్రముఖ ఛాయా గ్రాహకుడు సంతోష్ శివన్..ఈ చిత్రంలో కీలకమైన రవివర్మ పాత్రను చేస్తున్నారు. లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వం వహిస్తారు. ఇటీవలే శివన్, కార్తీకపై ఫొటో షూట్ చేశారు. వచ్చే వారంలో చిత్రీకరణ మొదలవుతుంది.


Click it and Unblock the Notifications











