తమన్నాని తీసేసి రాధ కూతుర్ని పెట్టి...
నాగచైతన్య హీరోగా పరిచయం అవుతూ చేసిన జోష్ చిత్రంలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన రాధ కూతురు కార్తీక గుర్తుందా..ఆమె తాజాగా శింబు సరసన ఓ చిత్రంలో కమిటయ్యింది. అయితే అది తమన్నాను తీసేసి ఆమెను తీసుకోవటంతో పెద్ద వార్తయ్యింది. శింబు హీరోగా కెవి ఆనంద్ దర్శకత్వంలో రూపొందనున్న 'కో' అనే తమిళ చిత్రంలో తమన్నాని మొదట హీరోయిన్ గా తీసుకున్నారు. అలాగే కోలివుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో శింబు కావటంతో తమన్నా కూడా ఎగిరి గంతేసింది.
అందులోనూ తమన్నానే కావాలని శింబు ఏరికోరి ఆమెను పిలిపించి తీసుకున్నాడు. అంతవరకూ బాగానే ఉంది. అయితే షూటింగ్ మొదలవగానే ఆమె మిస్సయ్యింది. ఏంటి అని చెన్నై వర్గాలు ఆరా తీస్తే అసలు విషయం బయిటపడింది. తమన్నా విధించిన నిబంధనలు విపరీతమవటంతో అవి నచ్చక నిర్మాత చివరి నిమిషం వరకూ ఆలోచించి హీరోని ఒప్పించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎడ్వాన్స్ పోయినా పర్వాలేదు కానీ ఆమె రూల్స్ పాటించటం మాత్రం నా వల్ల కాదని చేతులు ఎత్తేసాడు. దాని ఫలితంగా తమన్నా స్థానంలో రాధ కుమార్తె కార్తీకని వచ్చి చేరింది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











