valimai మూవీలో అదిరిపోయే యాక్షన్, స్టంట్స్.. నా కళ్లముందే అజిత్‌కు యాక్సిడెంట్ అంటూ కార్తికేయ

RX 100 చిత్రంతో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకొన్న కార్తికేయ గుమ్మకొండ సినిమా సినిమాకు అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గా, ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఐదారు చిత్రాల్లో నటించాడో లేదో.. కార్తీకేయ తమిళ సినీ వర్గాలను ఆకట్టుకొన్నారు. ఏకంగా సూపర్ స్టార్ అజిత్‌తో వలిమై సినిమాలో నటించే అవకాశం దక్కించుకొన్నారు. ఆ సినిమా విశేషాలను కార్తికేయ వెల్లడిస్తూ..

అజిత్ గారితో నాకు తొలి రోజు కాంబినేష‌న్ సీన్స్ లేవు. నార్మల్‌గా షూట్ చేశారు. రెండో రోజు అజిత్ గారితో సీన్స్ తీశారు. ఆయన్ను కలిసే ముందువరకూ కొంచెం టెన్షన్ ఉంది. నాకు తెలియని లాంగ్వేజ్. ఆయన పెద్ద స్టార్. ఎలా ఉండాలో, ఏంటో? అని కంగారు పడ్డాను. కానీ ఒక్కసారి ఆయను కలిసిన ఒక నిమిషంలో చాలా కంఫ‌ర్ట‌బుల్‌గా ఉండొచ్చ‌నే వైబ్ ఇచ్చేశారు. సెట్‌లో జూనియ‌ర్ ఆర్టిస్ట్ నుంచి అందరూ కంఫ‌ర్ట‌బుల్‌గా ఉండేలా చూస్తారు. సూపర్ స్టార్ అన్నట్టు బిహేవ్ చేయరు. దాంతో నేను ఈజీగా నటించా. ఈ సినిమా కోసం తమిళ భాషను కూడా కొంత నేర్చుకున్నాను అని కార్తీకేయ చెప్పారు.

Kartikeya Gummakonda about Ajith and Valimai movie

వలిమై చిత్రానికి తమిళంలో నేను డబ్బింగ్ చెప్పాను. అయితే దర్శకుడు వినోద్‌తో 'సార్. నాకే అక్కడక్కడా తెలుగులో మాట్లాడినట్టు అనిపిస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పాను. ఫైనల్ మిక్సింగ్ అయ్యాక డబ్బింగ్ గురించి ఆలోచిస్తానని చెప్పారని కార్తీకేయ అన్నారు.

Kartikeya Gummakonda about Ajith and Valimai movie

అజిత్‌తో కలిసి బైక్ స్టంట్స్ చేశాను. వలిమై చిత్రంలో స్టంట్స్, యాక్షన్ దృశ్యాలు చాలా కొత్తగా ఉంటాయి. ఇప్పటివరకు చేయని స్టంట్స్ చేశా. ఇండియన్ సినిమాలో అయితే నేను అలాంటి స్టంట్స్ చూడలేదు. బాలీవుడ్ వార్ సినిమాలో గ్రాండియర్ ఉంది. రిస్కీ షాట్స్, మేకింగ్... డిఫెరెంట్‌గా చేశారు. అవి చూసి నేనూ చేయాలని ఇన్స్పైర్ అయ్యాను. అజిత్ గారితో చేయడం కొంచెం కష్టమే. ఒక స్టంట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు నా ముందే ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు భయమేసింది. యాక్షన్ చేసేటప్పుడు నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను అని కార్తీకేయ చెప్పారు.

యువి క్రియేషన్స్ సంస్థలో ఒక సినిమా చేస్తున్నాను. తర్వాత క్లాక్స్ అని అబ్బాయి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను. శివలెంక కృష్ణప్రసాద్ గారి శ్రీదేవి మూవీస్ సంస్థలో ఓ సినిమా ఓకే అయ్యింది. అన్నీ డిఫరెంట్ జానర్ సినిమాలు. 'వలిమై' సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అందులో నటించడం వల్ల తమిళం నుంచి అవకాశాలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X