ముఖ్యమంత్రి రాసిన పాటకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
కమల్ హాసన్ తాజా చిత్రం కరుణయమ్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఉదయగిరి స్టాలిన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కోసం తమిళ నాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఓ పాటను రాస్తున్నారు. దానికి దేవి సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ సంఘటన చాలా విచిత్రంగా జరిగిందని ఆ చిత్రం యూనిట్ చెబుతోంది. ఈ పాటను దర్శకుడు రవి కుమార్ పట్టుకొచ్చి రైటర్ ఎవరని చెప్పకుండా కమల్ కి ఇచ్చి చదవమన్నారు. కమల్ అంత అధ్బుతమైన సాహిత్యానికి స్టన్నయిపోయారు. ఒక్క కమల్ మాత్రమే కాక అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారుట. దాంతో ఎవరా రైటర్ పరిచయం చేయమన్నా రవికుమార్ నవ్వి అలాగే త్వరలోనే మన సెట్ కు వస్తారని అన్నారుట. అలా చాలా సేపు సస్పెన్స్ మెయింటైన్ చేసిన తర్వాత రవికుమార్ ఆ పాట రాసింది మరెవరో కాదు కరుణానిధి అని చెప్పారుట. దాంతో వెంటనే కమల్..కరుణానిధికి ఫోన్ చేసి ఎప్రిసియేట్ చేసారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో కమల్ తో పాటు మాధవన్, త్రిష చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











