‘సోషియల్ సర్వీస్’ అవార్డు దక్కించుకొన్న‘లారెన్స్’
పాపులర్ కోరియోగ్రాఫర్, యాక్టర్, డైరక్టర్ లారెన్స్ రాఘవేంద్ర గురించి చెప్పాలంటే ఫిసికల్ యాక్టివిటి, నటన సామర్ధ్యాలతో ప్రేక్షకులను ఇంప్రేస్ చేయడమే కాక, మరొక విధంగా సమాజ సేవకు సహయపడుతున్నందుకుగాను ఈ సంవత్సరం సోషియల్ సర్వీస్ తరపున అవార్డు దక్కించుకొన్నారు. ఈ సంవత్సరం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ను ఆగస్ట్ 15న పోర్ట్ సెన్ట్ జార్జ్, చెన్నైలో జరుపోకోనున్నారు. ఈసందర్భంగా లారెన్స్ కి తమిళనాడు ముఖ్యమంత్రి యం. కరుణానిధి అవార్డును బహుకరించబోతున్నారు.
లారెన్స్ రాఘవేంద్ర 2005 సంవత్సరం చెన్నైలో ఒక చారిటబల్ సంస్థను ప్రాంభించి నడుపుతున్నారు. ఇందులో వికలాంగులను ప్రోత్సహించడం, వారికి ప్రేమ, ఆప్యాయతలను పంచడం. పేద పిల్లలకు ఉచిత విద్య, వసుతులు ఆర్థికంగా సహాయపడుతున్నారు. అతని ఫ్రీ టైమ్ అంతా ఈ సంస్థలోనే గడుపుతున్నాడు. లారెన్స్ సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతా తను నిర్మించిన చారిటబల్ సంస్థకే ఉపయోగింస్తున్నాడు.


Click it and Unblock the Notifications