స్టార్ హీరో తండ్రిపై హీరోయిన్ సెటైర్లు.. వేదికపైనే గట్టిగా ఇచ్చాడు!

Recommended Video

Kasthuri Makes Fun Of Sivakumar In Front Of Son Karthi | Filmibeat Telugu

స్టార్ హీరో సూర్య తండ్రి శివకుమార్ ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు. నటుడిగా అనేక చిత్రాల్లో నటించిన శివ కుమార్ ప్రస్తుతం తన తనయులు సూర్య, కార్తీ నటన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే శివ కుమార్ ఇటీవల మాత్రం తరచుగా వివాదాలు కొనితెచ్చుకుంటూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. కొన్ని నెలల క్రితమే అభిమాని ఫోన్ కిందపడేసిన వివాదం కారణంగా శివకుమార్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. కొద్దిరోజుల క్రితం అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. తన తండ్రి శివ కుమార్ కు సంబంధించి సీనియర్ హీరోయిన్ కస్తూరి, హీరో కార్తీ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

ఆడియో వేడుకలో

ఆడియో వేడుకలో

హీరో కార్తీ ఇటీవలే దేవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. సోమవారం చెన్నైలో జరిగిన జులై కాట్రిల్ చిత్ర ఆడియో వేడుకకు కార్తీ అతిథిగా హాజరయ్యాడు. ఈ ఆడియో వేడుకలో ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్, సీనియర్ హీరోయిన్ పాల్గొన్నారు. ఆడియో వేడుకలో కస్తూరి, కార్తీ మధ్య ఆసక్తికర సంఘటన చోరు చేసుకుంది.

 సెల్ఫీకి ప్రయత్నించి

సెల్ఫీకి ప్రయత్నించి

కార్తీ వేదికపైకి ప్రసంగించడానికి వస్తున్న సమయంలో కస్తూరి ఊహించని విధంగా స్పందించింది. కార్తితో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ.. మీ నాన్న ఇక్కడ లేడు.. త్వరగా సెల్ఫీ తీసుకుందాం అని సరదాగా సెటైర్లు వేసింది. కస్తూరి సెటైర్లు, సోషల్ మీడియాలో తన తండ్రిపై వస్తున్న ట్రోలింగ్ కు కార్తీ ఒకేసారి ధీటైన సమాధానం ఇచ్చాడు.

మర్యాద లేకుండా పోయింది

మర్యాద లేకుండా పోయింది

కస్తూరి సెటైర్లపై స్పందిస్తూ.. జనాలకు మర్యాద లేకుండా పోయింది అని కార్తీ అన్నారు. సెల్ఫీ తీసుకునేటప్పుడు అవతలి వ్యక్తి అనుమతి తీసుకోవాలనే కనీసం జ్ఞానం లేకుండా పోయింది. ఇష్టం వచ్చినట్లు మీద పడిపోతుంటారు. అవతలి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అని ఆలోచించారు. పైగా ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ లో ముందు ఒక ఫ్లాష్, వెనుక మరో ఫ్లాష్ లైట్స్ ఉంటున్నాయి. ఆ ఫ్లాష్ వలన పెద్ద వారికి కంటి, తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయని కార్తీ వివరణ ఇచ్చాడు.

డీసెంట్‌గా ఉండండి

డీసెంట్‌గా ఉండండి

కార్తీ స్పీచ్ తర్వాత కస్తూరి కూడా స్పందించింది. కార్తీ అభిప్రాయంతో అంగీకరించింది. అభిమానులు సెల్ఫీలు తీసుకునే సమయంలో డీసెంట్ గా బిహేవ్ చేయాలని కోరింది. మీరు సెల్ఫీ తీసుకోవాలనుకునే వారి అనుమతి తీసుకుంటే మంచింది అని అభిప్రాయపడింది. కస్తూరి తెలుగులో అన్నయ్య, నిప్పు రవ్వ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో తమిజ్ పాదం 2 లాంటి చిత్రాల్లో 44 ఏళ్ల వయసులో కూడా గ్లామర్ రోల్స్ తో అదరగొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X