Don't Miss!
- News ఎంపీ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఇంపాక్ట్ ఉంటుందా?
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అలాంటి వాటిని ఎంకరేంజ్ చేస్తోంది.. స్టార్ ‘విజయ్’పై దుమ్మెత్తిపోసిన కస్తూరీ!
కోలీవుడ్‌లో ప్రస్తుతం రెండు విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకటి వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లి, మరొకటి హీరో, హీరోయిన్లపై మీరా మిథున్ చేసే పిచ్చి కామెంట్స్. ఇవి రెండూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. అయితే ఈ రెండు టాపిక్స్‌లో కామన్‌గా ఎంటరైంది కస్తూరీ శంకర్. బిగ్ బాస్ మూడో సీజన్ పార్టిసిపెంట్స్ కావడమనేది ఈ ముగ్గురికి కామన్ పాయింట్. తాజాగా కస్తూరీ మీరా మిథున్‌ను పరోక్షంగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే దళపతి విజయ్‌పై నెగెటివ్ ప్రచారం చేస్తోన్న స్టార్ విజయ్ చానెల్‌పై కస్తూరీ సెటైర్ వేసింది.
మీరా మిథున్ వ్యాఖ్యలు..
గత కొన్ని రోజులుగా మీరా మిథున్ చేసే కామెంట్స్ సెన్సేషనల్ అవుతున్నాయి. తనను కాపీ కొడుతోందని త్రిషపై, నెపోటిజం, కోలీవుడ్ గురించి, స్టార్ల గురించి మీరా మీథున్ వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉంది. ఈ కమ్రంలోనే సూర్య, విజయ్‌లపై విరుచుకుపడింది. ఇక బదులుగా వారి వారి ఫ్యాన్స్ మీరా మిథున్‌ను ఓ రేంజ్లో ఆడుకున్నారు.
నెటిజన్స్ ఫైర్..
మీరా మిథున్ చేసే వ్యాఖ్యలపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. మగాళ్లు కాదా? గాజులుచీరలు పంపమంటారా? అని సూర్య, విజయ్‌లపై మీరా మిథున్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక వీటిపై కస్తూరీ కూడా కాస్త గట్టిగానే కౌంటర్ వేసింది. అయితే ఎక్కడా కూడా మీరా మిథున్ పేరును వాడలేదు.
కోలీవుడ్, నెపోటిజం..
నెపోటిజం, క్యాంప్స్ మాఫియా లాంటి ఎన్నడూ ఎంటర్ కానీ ఒకే ఒక ఇండస్ట్రీ కోలీవుడ్ అని కస్తూరీ చెప్పుకొచ్చింది. తమిళ పరిశ్రమలో సక్సెస్ కావాలంటే రెండే రెండు కావాలని, ఒకటి కఠోర శ్రమ, రెండు చిన్నపాటి అదృష్టమని తెలిపింది. ఇదే సూత్రం అందరికీ వర్తిస్తుందని సూర్య, విజయ్‌లను తిట్టడం మానుకోమన్నట్టుగా కౌంటర్ వేసింది.
స్టార్ విజయ్‌పై ఫైర్..
స్టార్ విజయ్ చానెల్ నెగెటివిటీని ప్రమోట్ చేస్తోందని కస్తూరీ ఫైర్ అయింది. దళపతి విజయ్ను కించపరిచే వారిని స్టార్ విజయ్ చానెల్ ప్రమోట్ చేస్తోందని చెప్పుకొచ్చింది. ఈ కాంట్రవర్సీలు మొదలు కావడానికి కారణం స్టార్ విజయ్ అంటూ పరోక్షంగా కౌంటర్ వేసింది. ఇక కస్తూరి చేసిన ట్వీట్‌పై నెటిజన్స్ కూడా పాజిటివ్ రియాక్షన్ ఇస్తున్నారు.