twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి వాటిని ఎంకరేంజ్ చేస్తోంది.. స్టార్ ‘విజయ్’పై దుమ్మెత్తిపోసిన కస్తూరీ!

    |

    కోలీవుడ్‌లో ప్రస్తుతం రెండు విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకటి వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లి, మరొకటి హీరో, హీరోయిన్లపై మీరా మిథున్ చేసే పిచ్చి కామెంట్స్. ఇవి రెండూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. అయితే ఈ రెండు టాపిక్స్‌లో కామన్‌గా ఎంటరైంది కస్తూరీ శంకర్. బిగ్ బాస్ మూడో సీజన్ పార్టిసిపెంట్స్ కావడమనేది ఈ ముగ్గురికి కామన్ పాయింట్. తాజాగా కస్తూరీ మీరా మిథున్‌ను పరోక్షంగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే దళపతి విజయ్‌పై నెగెటివ్ ప్రచారం చేస్తోన్న స్టార్ విజయ్ చానెల్‌పై కస్తూరీ సెటైర్ వేసింది.

    మీరా మిథున్ వ్యాఖ్యలు..

    మీరా మిథున్ వ్యాఖ్యలు..

    గత కొన్ని రోజులుగా మీరా మిథున్ చేసే కామెంట్స్ సెన్సేషనల్ అవుతున్నాయి. తనను కాపీ కొడుతోందని త్రిషపై, నెపోటిజం, కోలీవుడ్ గురించి, స్టార్ల గురించి మీరా మీథున్ వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉంది. ఈ కమ్రంలోనే సూర్య, విజయ్‌లపై విరుచుకుపడింది. ఇక బదులుగా వారి వారి ఫ్యాన్స్ మీరా మిథున్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.

     నెటిజన్స్ ఫైర్..

    నెటిజన్స్ ఫైర్..

    మీరా మిథున్ చేసే వ్యాఖ్యలపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. మగాళ్లు కాదా? గాజులుచీరలు పంపమంటారా? అని సూర్య, విజయ్‌లపై మీరా మిథున్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక వీటిపై కస్తూరీ కూడా కాస్త గట్టిగానే కౌంటర్ వేసింది. అయితే ఎక్కడా కూడా మీరా మిథున్ పేరును వాడలేదు.

     కోలీవుడ్, నెపోటిజం..

    కోలీవుడ్, నెపోటిజం..

    నెపోటిజం, క్యాంప్స్ మాఫియా లాంటి ఎన్నడూ ఎంటర్ కానీ ఒకే ఒక ఇండస్ట్రీ కోలీవుడ్ అని కస్తూరీ చెప్పుకొచ్చింది. తమిళ పరిశ్రమలో సక్సెస్ కావాలంటే రెండే రెండు కావాలని, ఒకటి కఠోర శ్రమ, రెండు చిన్నపాటి అదృష్టమని తెలిపింది. ఇదే సూత్రం అందరికీ వర్తిస్తుందని సూర్య, విజయ్‌లను తిట్టడం మానుకోమన్నట్టుగా కౌంటర్ వేసింది.

    స్టార్ విజయ్‌పై ఫైర్..

    స్టార్ విజయ్‌పై ఫైర్..

    స్టార్ విజయ్ చానెల్ నెగెటివిటీని ప్రమోట్ చేస్తోందని కస్తూరీ ఫైర్ అయింది. దళపతి విజయ్‌ను కించపరిచే వారిని స్టార్ విజయ్ చానెల్ ప్రమోట్ చేస్తోందని చెప్పుకొచ్చింది. ఈ కాంట్రవర్సీలు మొదలు కావడానికి కారణం స్టార్ విజయ్ అంటూ పరోక్షంగా కౌంటర్ వేసింది. ఇక కస్తూరి చేసిన ట్వీట్‌పై నెటిజన్స్ కూడా పాజిటివ్ రియాక్షన్ ఇస్తున్నారు.

    English summary
    Kasthuri Shankar Counters On Star Vijay for Targeting Thalapathy Vijay. Irony : Star Vijay promotes few negative people ; who insult The star Vijay. STARVijay - STARting Point for STARtling Controversies. #nohashtags
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X