twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోలీవుడ్‌లో సక్సెస్ కావాలంటే అవి రెండు ముఖ్యం.. మీరా మిథున్‌కు కస్తూరీ కౌంటర్

    |

    మీరా మిథున్ గత కొంత కాలం నుంచి తమిళ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. మోడల్, నటి, హీరోయిన్, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్‌గా రాని పేరు.. సోషల్ మీడియా ద్వారా వస్తోంది. త్రిష తనను కాపీ కొడుతోందని, తన క్యాస్టూమ్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ ఇలా అన్నింటిని త్రిష కాపీ కొడుతుందని ఇకపై ఊరుకునేది లేదని ఓరేంజ్‌లో ట్వీట్లు చేసింది. వీటిని ఎవ్వరూపట్టించుకోకపోయే సరికి ఇంకాస్త డోసు పెంచింది. త్రిషపై ఆరోపణలు చేసింది. ఇది కూడా సరిపోవడం లేదని స్టార్ హీరోలను టార్గెట్ చేసింది.

    విజయ్, సూర్యలపై..

    విజయ్, సూర్యలపై..

    కోలీవుడ్ స్టార్లపై మీరా మిథున్ చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఈమెపై నెటిజన్లు, ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మొత్తానికి మీరా మిథున్ అటెన్షన్ కోసం వేసిన ఎత్తుగడలు ఫలించాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వీరంతా నెపోటిజం కిడ్స్ అని, ఫ్యాన్స్‌ను కూడా కంట్రోల్ చేసుకోలేరని తీవ్రస్థాయిలో తిట్టింది.

    మీరా మిథున్‌కు కౌంటర్..

    మీరా మిథున్‌కు కౌంటర్..

    కస్తూరీ, మీరా మిథున్‌లు బిగ్ బాస్ మూడో సీజన్‌లో తోటి కంటెస్టెంట్లుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఒకరిపై మరొకరు సెటైర్స్ వేసుకునే వరకు వచ్చింది. మీరా మిథున్ హద్దులు మీరి చేస్తున్న కామెంట్లపై కస్తూరీ ఫైర్ అయింది. కోలీవుడ్ గొప్పదనాన్ని వివరించింది.

    అవి లేని ఏకైక పరిశ్రమ..

    అవి లేని ఏకైక పరిశ్రమ..

    నెపోటిజం, క్యాంప్స్ మాఫియా లాంటి ఎన్నడూ ఎంటర్ కానీ ఒకే ఒక ఇండస్ట్రీ కోలీవుడ్. అందులోనూ ఇక్కడ సినిమా ఫ్యామిలీలు ఎంత ఎత్తుకు ఎదిగి ఉన్నాయి.. వారి నుంచి వచ్చే వారికి ఎన్నో అంచనాలను అందుకోవాల్సి ఉంటుంది. అందుకే వారు బయట నుంచి వచ్చిన వారికంటే ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది.

    అవి రెండు ముఖ్యం..

    అవి రెండు ముఖ్యం..

    తమిళ పరిశ్రమలో సక్సెస్ కావాలంటే రెండే రెండు కావాలి. ఒకటి కఠోర శ్రమ, రెండు చిన్నపాటి అదృష్టం. ఇదే సూత్రం అందరికీ వర్తిస్తుంది. వారసత్వంగా వచ్చినా, మాఫియా నుంచి వచ్చినా ఇంకెక్కడి నుంచి వచ్చినా సరే. అందుకే విజయ్, సూర్య, కార్తీ, జయం రవి లాంటి హార్డ్ వర్క్ చేసే అద్భుతమైన నటులు కోలీవుడ్‌లో సక్సెస్ సాధించారు. వారి తండ్రులు ఏమీ చేయలేదు.

    ప్రతిభ లేని వారే..

    ప్రతిభ లేని వారే..

    బయటి నుంచి వచ్చిన అజిత్ సర్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్ వంటి వారు అద్భుతమైన నటులకు ఉదాహరణ. కేవలం ప్రతిభ లేని వారే అలా ఊహించుకుంటారు.. నెపోటిజం ఉందని వారికి నచ్చినట్టుగా ఊహలు అల్లేసుకుంటార'ని కస్తూరీ ఫైర్ అయింది.

    English summary
    Kasthuri Shankar Counters To meera mithun. And She says About vijay, Suriya And Nepotism In Kollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X