For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏమో చేద్దామని అనుకుంది.. చివరకు జోకర్ అయింది.. వనిత వ్యాఖ్యలపై కస్తూరీ ఫైర్

  |

  వనిత విజయ్ కుమార్ మళ్లీ వార్తల్లో నిలిచింది. చూస్తుంటే ఎంతో ముచ్చట పడి చేసుకున్న మూడో పెళ్లి కూడా పెటాకులయ్యేలానే కనిపిస్తోంది. పీటర్ పాల్, వనిత మధ్య గొడవలు జరిగాయని, భర్తను తన్ని ఇంటి నుంచి తరిమేసిందనే వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలో వనిత ఎమోషనల్ అవుతూ ఓ సుధీర్ఘమైన లేఖను పోస్ట్ చేసింది. అంతకు ముందు వరుసగా ట్వీట్లు చేసింది. మొత్తానికి ఈ ట్వీట్ల సారాంశాన్ని బట్టి చూస్తే మూడో పెళ్లి కథ కంచికి చేరినట్టుంది.

  అందరూ కలిసి..

  అందరూ కలిసి..

  కోవిడ్ లాంటి కష్ట కాలంలో, మీడియా మమ్మల్ని ఎంతగా టార్గెట్ చేసినా, మా పర్సనల్ విషయాలను వాడుకుని ఎంతో మంది పేరు, డబ్బులను సంపాదించుకున్నా మేం మాత్రం ప్రేమగా నవ్వుకుంటూనే ఉన్నాం. మా వ్యక్తిగత విషయాలను రోడ్డుకు ఈడ్చీ మీడియలో సర్కస్ చేయించినట్టు ఆడుకున్నారు అంటూ వనిత ఎమోషనల్ అయింది.

  అనుకోనిది జరిగింది..

  అనుకోనిది జరిగింది..

  నేను అనుకోనిది జరిగింది.. ఇలా కాకుండా ఉండాల్సింది కానీ అయింది. కానీ ఏదో ఒక అద్భుతం జరుగుతుందన్న నమ్మకం నాకుంది. ప్రేమ కోసం ఎదురుచూస్తున్నా.. అతను వస్తాడని అనుకుంటున్నాను అంటూ అసలు విషయాన్ని చెప్పకుండా తమ మధ్య గొడవలు జరిగాయన్న విషయాన్ని పరోక్షంగా వనిత చెప్పుకొచ్చింది.

  నిజాయితీ, ముక్కుసూటి..

  నిజాయితీ, ముక్కుసూటి..

  కొందరు మా మీద పడి బతుకుతున్నారు.. పక్కవారి బాధల్లోంచి సంతోషాన్ని వెతుక్కుంటున్నారు.. కానీ నేను నిజాయితీగానే ఉంటాను.. ముక్కుసూటిగానే మాట్లాడతాను. ఏదైనా జరిగితే నేనే నేరుగా ప్రపంచానికి చెబుతాను. నా దగ్గర దాచడానికి ఏమీ లేదు.. పైగా నేను ఏదీ దాచను కూడా అంటూ వనిత కాస్త ఘాటుగానే స్పందించింది.

  కస్తూరీ ఫైర్..

  కస్తూరీ ఫైర్..

  అయితే వనిత చేసిన ఈ వ్యాఖ్యలు కస్తూరీ, సూర్యా దేవీ, విజయన్ వంటి వారినేని అందరికీ తెలిసిందే. కొందరు నెటిజన్లు ఇదే విషయంపై కస్తూరిని నిలదీశారు. దీనిపై ఘాటుగా స్పందించిన కస్తూరీ.. ఒక వేళ మీ జీవితాన్ని పర్సనల్‌గా ఉంచాలని అనుకున్నప్పుడు మీరు కూడా ప్రైవేట్‌గానే ఉండాలని ఫైర్ అయింది.

  Rekha Biography, Top Films And Controversies | Happy Birthday Rekha || Oneindia Telugu
  జోకర్‌లా మిగిలింది..

  జోకర్‌లా మిగిలింది..

  ప్రతీదీ సోషల్ మీడియాలో పెట్టేసి పర్సనల్ లైఫ్ అంటే ఎలా..తాజా విషయాన్ని కూడా పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడం ఎందుకు? దీన్నే స్టంట్ అంటారని కస్తూరీ సెటైర్ వేసింది. ఎవ్వరూ కూడా ఆమె లైఫ్‌ను మీడియా సర్కస్ చేయలేదు. ఆమె అంతా చేసుకుంది. ఆమె సర్కస్, ఆమె కోతులు అన్నీ. అయితే రింగ్ మాస్టర్ కూడా ఆమెనే అని అనుకుంది. కానీ చివరకు జోకర్‌లా మిగిలింది. ఆమె నిజాయితీ, ముక్కుసూటి అని మాటలు చెబుతూ ఉంటే నాకు నవ్వొస్తుందని కస్తూరీ కౌంటర్లు వేసింది.

  English summary
  Kasthuri Shankar Fires On Vanitha Vijay Kumar Comments, Nobody made her life a media circus. She created her own. Her circus, Her monkeys. She thought she will be ringmaster, but ended up being the clown. If I hear the words " honest aa solren, straight forward person" again, I swear I will... grrrr.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X