ఇలాంటి పరిస్థితిలో అలానా ప్రవర్తించేది.. అజిత్, విజయ్ ఫ్యాన్స్‌పై హీరోయిన్ ఫైర్
ఫ్యాన్స్ గొడవ పడటానికి సమయం సందర్భం లాంటివి ఏమీ అవసరం ఉండదు. ముఖ్యంగా దక్షిణాదిన తమ అభిమాన హీరో హీరోయిన్లను దైవ సమానులుగా చూస్తుంటారు. మరీ ముఖ్యంగా అయితే తమిళ నాట ఏకంగా దేవాలయాలు కూడా కట్టేస్తారు. ప్రస్తుతం తమిళ నాట రజినీ, అజిత్, విజయ్ ఫ్యాన్స్ హడావిడి ఎక్కువగా ఉంటుంది. వీరి అభిమానులు సోషల్ మీడియాలో హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. ఒకరి ఫ్యాన్స్ మిగతా వారిపై కామెంట్స్ చేస్తుంటారు.
సోషల్ మీడియాలో నిత్యం ఫ్యాన్ వార్ జరుగుతూనే ఉంటుంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వాగ్వాదానికి దిగుతారు. ఆ మధ్య టాలీవుడ్, కోలీవుడ్ అని విడిపోయి మరీ వల్గర్ కామెంట్స్ చేసుకున్నారు. మహేష్ బాబు, విజయ్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో నానా రచ్చ చేశారు. డమ్మీ స్టార్, రీమేక్ స్టార్ అంటూ నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యేలా ట్రెండ్ చేశారు. తాజాగా అజిత్, విజయ్ ఫ్యాన్స్ తీవ్ర ధూషించుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటున్నారు.

ఇలా జరుగుతున్న ఫ్యాన్స్ వార్‌లోకి హీరోయిన్ కస్తూరి ఎంట్రీ ఇచ్చింది. అన్నమయ్య సినిమాలో నాగ్‌తో ఆడి పాడిన కస్తూరి.. నెటిజన్స్‌పై ఫైర్ అయింది. 'అజిత్, విజయ్ ఇద్దరూ బాగానే ఉంటారు.. వారిద్దరు బాగానే మాట్లాడుకుంటారు.. మీరు శాపనార్థాలు పెట్టినంత మాత్రానా ఏమీ జరగదు.. అయినా ప్రపంచమంతా ఇప్పుడు అతలాకుతలం అవుతూ ఉంటే.. మీరు ఇలాంటి చేయడం అవసరమా? నెగెటివిటీని వదిలేయండి.. మీరు బతకండి.. అవతలి వారిని బతకనివ్వండ'ని ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











