ఫేక్ వైఫ్, బ్రెయిన్ కూడా లేదు.. వనితా విజయ్‌కుమార్‌‌పై కస్తూరీ శంకర్ దారుణ కామెంట్స్

వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ వివాహాం తమిళ నాట పెద్ద చిచ్చునే రగిల్చింది. వనిత మూడో వివాహాంపై ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పీటర్ తన మొదటి భార్య ఎలిజబెత్‌ హెలెన్‌కు విడాకులు ఇవ్వకుండా వనితను పెళ్లి చేసుకోవడంతో రచ్చ మొదలైంది. తన భర్త మోసం చేశాడని, తనకు విడాకులు ఇవ్వకుండానే వనితను పెళ్లి చేసుకున్నాడని ఎలిజబెత్ ఫిర్యాదు చేసింది. ఇక అక్కడితే మొదలైన ఈ ఘట్టం నేటికీ కొనసాగుతూనే ఉంది.

మధ్యలో ఎంట్రీ..

మధ్యలో ఎంట్రీ..

వీరి వ్యవహారంలో నిర్మాత రవీంద్రన్, లక్ష్మీ రామకృష్ణన్, సూర్యాదేవీ, కస్తూరి శంకర్, నంజిల్ విజయన్ వంటివారు ఎంటర్ అయ్యారు. ఈ అందరూ కలిసి వనితను టార్గెట్ చేశారు. ఆమె చేసింది తప్పని సోషల్ మీడియాలో, టీవీ డిబెట్లలో, యూట్యూబ్ చానెల్స్‌లో ఓ రేంజ్‌పై ఫైర్ అయ్యారు. ఇక వీరి ధాటికి తట్టుకోలేక వనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సూర్యాదేవీ అరెస్ట్..

సూర్యాదేవీ అరెస్ట్..

తన మీద, వ్యక్తిగత జీవితంపైనా దుర్భాషలాడుతోందని సూర్యాదేవీపై వనిత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సూర్యాదేవీని అర్దరాత్రి అరెస్ట్ చేశారు. ఈ సంఘటన అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఇక కస్తూరీ శంకర్ బెయిల్ ఇచ్చి సూర్యాదేవీని విడిపించింది. ఇక నంజిల్, సూర్యాదేవీ, కస్తూరిపై వనిత ఎప్పటికప్పుడు సెటైర్లు వేయడం, అటు వైపు నుంచి కౌంటర్స్ రావడం జరుగుతూనే ఉంది.

వనిత, విజయన్ స్టోరీ..

వనిత, విజయన్ స్టోరీ..

వనిత, నంజిల్ విజయన్ మధ్య జరుగుతున్న మాటల యుద్దం గురించి అందరికీ తెలిసిందే. నంజిల్ విజయన్ తను చేసిన తప్పులకు క్షమించమని అడిగాడని వనిత చెప్పుకొస్తుండగా.. అలా తాను చెప్పలేదని నంజిల్ కొట్టిపారేశాడు. ఇక రీసెంట్ ఓ పెద్ద తాళం కొన్నానని, ఇది ఎవరి నోటికి వేయడానికో తెలుసా? అంటూ నంజిల్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది.

బ్రెయిన్ వాష్..

బ్రెయిన్ వాష్..

తాజాగా ఓ నెటిజన్ కొందరికి బ్రెయిన్ వాష్ చేయాలి, వారంతా ఫేక్ లాయర్స్, వారిని ఆరోగ్యంగా ఉండనివ్వాలని వనితకు ట్యాగ్ చేశారు. అవును కరోనా వల్ల బ్రెయిన్ కూడా డ్యామేజ్ కావొచ్చని వనిత పరోక్షంగా కస్తూరిపై సెటైర్స్ వేసింది.

Recommended Video

Ala Vaikunthapurramuloo Bollywood Remake,Star Hero Showing Intrest!
ఫేక్ వైఫ్..

ఫేక్ వైఫ్..

వనిత వేసిన సెటైర్స్‌కు కస్తూరి రివర్స్ కౌంటర్ వేసింది. అవునవును.. కొందరైతే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని భయపడాల్సిన అవసరమే లేదు.. ఫేక్ వైఫ్ అంటూ ట్వీట్ చేసింది. వనితకు బ్రెయినే లేదని కస్తూరి వేసిన కౌంటర్ బాగానే వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X