»   » నాన్ లోకల్ అయినా తన స్టామినా చూపుతున్న పవన్ కళ్యాణ్!

నాన్ లోకల్ అయినా తన స్టామినా చూపుతున్న పవన్ కళ్యాణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' ఈ నెల 24న గ్రాండ్‌గా రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

తమిళనాడులో కాటమరాయుడు చిత్రాన్ని 1000 స్క్రీన్లకు తక్కువ కాకుండా రిలీజ్ చేయబోతున్నారట. తమిళంలో లోకల్ టాప్ స్టార్ల సినిమాలే 500 నుండి 800 స్క్రీన్లలో రిలీజ్ అవుతాయి. అలాంటిది ఒక తెలుగు స్టార్ సినిమా తమిళనాడులో ఇంత భారీగా రిలీజ్ అవుతుండటం చర్చనీయాంశం అయింది.


అదే సినిమా అయినా

అదే సినిమా అయినా

పైగా ‘కాటమరాయుడు' సినిమా తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వీరమ్' చిత్రానికి ఇది రీమేక్. అదే చిత్రం రీమేక్ వెర్షన్, అందులోనూ తమిళనాడులో ఇంత భారీగా రిలీజ్ చేయడం విశేషమే మరి.


 ఇంత భారీగా

ఇంత భారీగా

సాధారణంగా తెలుగు స్టార్ల చిత్రాలకు తమిళనాడు వ్యాప్తంగా 50 నుండి 100 స్క్రీన్లు కంటే ఎక్కువ లభించవు. కానీ కాటమరాయుడు సినిమా ఒక్క చెన్నైలోనే 170 స్క్రీన్లలో రిలీజ్ అవుతోందట. తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.


ప్రీ రిలీజ్ నిస్సిగ్గుగా, నిజాయితీగా...: పవన్ రాజకీయ సందేశం, అభిమానులకు ఉపదేశం!

ప్రీ రిలీజ్ నిస్సిగ్గుగా, నిజాయితీగా...: పవన్ రాజకీయ సందేశం, అభిమానులకు ఉపదేశం!

నాకు ఏ పని ఇచ్చినా సరే అది తోట పని కావచ్చు, వీధులు ఊడ్చే పని కావచ్చు. ఎలాంటి పనైనా సరే నిస్సిగ్గుగా, చాలా నిజాయితీగా పని చేస్తాను. సినిమాలు కూడా నాకు భగవంతుడు ఇచ్చిన బిక్ష అనుకుని ఎంత కృతజ్ఞతగా చేయాలో, ఎంత ఒళ్లు దగ్గర పెట్టుకుని చేయాలో ఇన్ని సంవత్సరాలు అంతే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసాను. భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా కానీ అంతే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాను.... అని పరోక్షంగా తన రాజకీయ ప్రయాణం గురించి ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


కోట్లలో ఒక్కడు... అంటూ పవన్ గురించి త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్!

కోట్లలో ఒక్కడు... అంటూ పవన్ గురించి త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్!

పవర్ స్టార్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎమోషన్ గా స్పందించారు. దేవుడు కొన్ని శక్తులు కోట్లలో ఒకకరికే ఇస్తాడు... అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ త్రివిక్రమ్ గొప్పగా చెప్పుకొచ్చారు..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


ట్రైలర్

కాటమరాయుడు అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లో అభిమానులను అలరించబోతున్నాడు.
English summary
Pawan Kalyan's 'Katamarayudu' is getting a wide release in Tamil Nadu. The total screen count of Tamil Nadu is less than 1,000. Even films of Top Tamil Stars would release in only 500-800 screens.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu