»   » హీరో ధనుష్ మా కొడుకే.. సాక్ష్యాలతో కోర్టుకెక్కిన దంపతులు!

హీరో ధనుష్ మా కొడుకే.. సాక్ష్యాలతో కోర్టుకెక్కిన దంపతులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమి హీరో, రజనీకాంత్ అల్లుడు... ధనుష్ తన కుమారుడే అంటూ ఓ ఇద్దరు వృద్ధ దంపతులు కోర్టు కెక్కారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన తమిళనాడులోని మేలూరు కోర్టు జుడిషియల్ మెజిస్ట్రేట్ ధనుష్ కు నోటీసులు జారీ చేసారు. ఈ కేసు విచారణలో భాగంగా జనవరి 12న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

హీరో ధనుష్ మీద ఇలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కోవడం తమిళ నాడులో చర్చనీయాంశం అయింది. మేలూరు తాలూకాలోని మనంపట్టి గ్రామానికి చెందిన ఆర్. కథరేసన్(60), కె. మీనాక్షి(55) ధనుష్ తమ కొడుకే అంటూ కోర్టు కెక్కారు. మా ఇద్దరికీ ధనుష్ నవంబర్ 7, 1985లో జన్మించాడని, అని అసలు పేరు కాలిసెల్వన్ అని తెలిపారు.

ఆధారాలతో సహా కోర్టుకు

ఆధారాలతో సహా కోర్టుకు

అతడు తమ పెద్ద కుమారుడని, ఇంకా తమకు ధనపాకియమ్ అనే కూతురు కూడా ఉందని ఆ దంపతులు కోర్టుకు తెలిపారు. ధనుష్ తమ కుమారుడే అంటూ బర్త్ సర్టిఫికెట్, ధనుష్ ను పోలి ఉన్న చిన్ననాటి ఫోటోలను కూడా ఈ దంపతులు కోర్టుకు సమర్పించారు.

పారిపోయాడు

పారిపోయాడు

తానొక రిటైర్డ్ బస్ కండక్టర్ అని, తన కుమారుడు 10వ తరగతి వరకు మేలూరులోని ఆర్ సి మిడిల్ స్కూల్ మరియు ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యనభ్యసించాడని, తర్వాత 2002లో అతన్ని 11వ క్లాసు చదువకోసం శివగంగ జిల్లా తిరుపథూర్ లోని అరుముగమ్ పిల్లై సతాయ్యామ్మాల్ హెచ్ఎస్ఎస్ లో చేర్పించామని.... అక్కడ చేర్పించిన నెలరోజుల్లోనే స్కూలు విడిచి పారిపోయాడని కథరేసన్ తన పిటీషన్లో పేర్కొన్నారు.

పేరు మార్చుకుని సినిమాల్లోకి

పేరు మార్చుకుని సినిమాల్లోకి

అక్కడి నుండి పారిపోయిన తర్వాత చెన్నై వెళ్లాడు... సినిమా రంగంలో కెరీర్ ప్రారంభించాడు. తన పేరు కూడా థనుష్ కె రాజాగా మార్చుకున్నాడు. ప్రస్తుతం మా కుమారుడు కస్తూరి రాజా దగ్గర ఉన్నాడని తమ పిటీషన్లో పేర్కొన్నారు.

మెయింటనెన్స్ ఇప్పించండి

మెయింటనెన్స్ ఇప్పించండి

మా పరిస్థితి ఇపుడు దయనీయంగా ఉంది. మా కుమారుడు నుండి తమకు నెలకు రూ. 65000 మెయింటనెన్స్ వచ్చేలా చూడాలని ఆ దంపతులు పిటీషన్లో పేర్కొన్నారు.

కస్తూరి రాజా కొడుకు, రజనీ అల్లుడు

కస్తూరి రాజా కొడుకు, రజనీ అల్లుడు

ధనుష్ మనకు ఇప్పటి వరకు తమిళ దర్శకుడు కస్తూరి రాజా కొడుకుగా, తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ సోదరుడిగా... సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా తెలుసు. మరి ఈ కేసు తర్వాత పరిస్థితి ఎలా మారబోతోందో?

English summary
Tamil star Dhanush is in trouble with the Judicial Magistrate Court in Melur. The magistrate has directed him appear before it on January 12 following a petition filed by a couple who claimed that they were his parents but he allegedly refused to provide them any maintenance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu