»   » కత్తి లాంటి ఫస్ట్ లుక్... ఓ లుక్ వేయండి(వీడియో)

కత్తి లాంటి ఫస్ట్ లుక్... ఓ లుక్ వేయండి(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: . 'తుప్పాక్కి' తర్వాత విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. ముంబయి, హైదరాబాద్‌, చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. వడపళనిలోని పుష్పాగార్డెన్‌లో పెద్ద సెట్‌ వేసి 40 రోజుల పాటు చిత్రీకరించారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ ని విడుదల చేసారు. అభిమానుల నుంచి మంచి అప్లాజ్ వస్తున్న ఈ ఫస్ట్ లుక్ పై ఓ లుక్ వేయండి..

ఈ నేపథ్యంలో షూటింగ్ ముగియడంతో తన యూనిట్‌కు విజయ్‌ విందు ఏర్పాటు చేశారు. విజయ్‌ కూడా వారితో కలిసి భోజనం చేశారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్. అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు. ఈనెలాఖరులో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళికి సినిమాను తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం.

Kaththi - First Look Motion Poster

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్‌. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. విజయ్‌కి ఉన్న మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్‌ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్‌ తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లోని 'తుపాకి' దీపావళికి విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెట్‌తో ఈసారి కూడా 'కత్తి'ని పదునెక్కించి దీపావళి కదనరంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు విజయ్‌.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/IB1NoiN_SR0?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Here is the first look motion poster of Kaththi starring Actor Vijay Samantha Ruth Prabhu an ARMurugadoss film! With Anirudh Ravichander music! &#13;
Please Wait while comments are loading...