హిట్ టాక్... హీరో గారు లండన్‌ లో ఎంజాయ్

By Srikanya

చెన్నై: షూటింగ్ లో నాలుగైదు నెలలు పాటు కంటిన్యూగా పాల్గొన్నవాళ్లు తమ కుటుంబంతో గడపటానికి ఏకాంతం కోరుకుంటారు. ముఖ్యంగా హీరోలు రెగ్యులర్ రొటీన్ ను తప్పించుకోవటానికి తమని తాము రిఫ్రెష్ చేసుకోవటానికి కుటుంబంతో టూర్ కి వెళ్లటమే పరిష్కారం గా భావిస్తారు. తాజాగా తమిళ హీరో విజయ్... ఫ్యామిలీ టూర్ ప్రిపరేషన్ లో ఉన్నాడు.

'కత్తి' హిట్‌తో ఇలయదళపతి విజయ్‌ ఖుషీగా ఉన్నారు. ఆ సినిమా చిత్రీకరణ, విడుదలకు సంబంధించి వివాదాల కారణంగా ఏమాత్రం తీరిక లేకుండా గడిపారాయన. ఇప్పుడు కాస్తంత తీరిక కలిగింది. ఆ సమయాన్ని తన కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి ఎంజాయ్‌ చేయాలనుకున్నారు. అందుకు లండన్‌కు త్వరలో వెళ్లనున్నారు. కొన్ని రోజులు గడిపాక తన తరువాత సినిమా షూటింగ్‌ సమయానికి తిరిగొచ్చేస్తారని సమాచారం.

తర్వాతి చిత్రం శింబుదేవన్‌ దర్శకత్వంలో మొదలుకానుంది. మొదటి షెడ్యూల్‌లో ఈ నెల 10న ఈసీఆర్‌ రోడ్డులో పాట షూటింగ్ లో విజయ్‌ పాల్గొననున్నారు. రెండో షెడ్యూల్‌లో భాగంగా కొంతభాగం కేరళలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించనున్నట్లు సమాచారం.

‘Kaththi’ Vijay will fly to London for relax

కత్తి విషయానికి వస్తే...

కత్తి చిత్రం దీపావళి సందర్భంగా బుధవారం విడుదలైంది. అనేక సమస్యల మధ్య విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ ని తెచ్చుకుంది.

ఇక మురుగదాస్‌ కథలన్నీ విభిన్నంగా ఉంటాయి. షార్ట్‌ టర్మ్‌ మొమొరీ లాస్‌ అనే కథాంశంతో 'గజిని' తీర్చిదిద్దారు. 'రమణ', 'సెవెన్త్‌సెన్స్‌', 'తుపాకీ' కూడా సాధారణ సినిమాలకు విభిన్నంగా సాగేవే. అందుకే మురుగదాస్‌ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి. ఇప్పుడాయన 'కత్తి' పదును చూపించారు. విజయ్‌, సమంత జంటగా నటించిన చిత్రమిది. కె.కరుణామూర్తి, ఎ.శుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మించారు. అనిరుథ్‌ స్వరాలు అందించారు.

తెలుగు వెర్షన్ కి వస్తే.... త్వరలో 'కత్తి' పాటల్ని, చిత్రాన్ని విడుదల చేస్తారు. చిత్ర సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ చిత్రమిది. సెంటిమెంట్‌కీ చోటుంది. అనిరుథ్‌ స్వరాలు అదనపు ఆకర్షణ. ''అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X