రజనీకాంత్‌తో సెక్సీ చికినీ చమేలీ...
ప్రస్తుతం బాలీవుడ్ లో చికినీ చమేలీ హవా నడుస్తోంది. అదే నండీ కత్రినా కైఫ్. అగ్నిపథ్ సినిమా కోసం ఆమె నర్తించిన 'చికినీ చమేలీ' ఐటం సాంగ్ ఏ రేంజ్ లో పాపులర్ అయిందో కొత్తగా చెప్పక్కర్లే. అందులో కత్రినా ఒంపు సొంపులు, షేపులు, ఊపులు కుర్రకారుకు రాత్రుళ్లు నిద్రలేకుండా చేస్తున్నాయి.
తాజాగా కోలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం కత్రినా రజనీకాంత్ సరసన బుక్ అయినట్లు తెలుస్తోంది. రజనీ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో నటిస్తున్న 'కొచాదనయ్' చిత్రంలో చివరకు కత్రినా కైప్ ను హీరోయిన్ గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై దర్శకురాలు సౌందర్య అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ లేనటువంటి 3డి ఎఫెక్టులతో కోచాదయన్ సినిమా రూపొందిస్తున్నారు. రజనీ చిన్న కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కె.ఎస్. రవికుమార్ కథ అందించారు. సౌందర్యకు దర్శకత్వం కొత్త కావడంతో రవి కుమార్ పర్యవేక్షణలో ఆమె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం క్రతినా కైఫ్ సల్మాన్, షారుఖ్ లతో రెండు బాలీవుడ్ చిత్రాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











